Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఒక్క లేఖతో అచ్చెన్నాయుడు అవినీతి బయటపడిందా ? అచ్చెన్న అవినీతి చిట్టా ఏసీబీ దగ్గర ఉందా ?

ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని చెప్తున్న ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫార్సు లెటర్ ఆధారంగా ఆయనను నిందితుడిగా తేల్చారు. అయితే ఆ లేఖ ద్వారా సిఫార్స్ మాత్రమే చేసిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏ మేరకు అవినీతి పాల్పడ్డాడు? ఏ విధంగా అవినీతి చేశారు?ఇక అచ్చెన్నాయుడు అవినీతి చిట్టా ఏసీబీ అధికారుల దగ్గర ఉందా ? అన్నవి ఇప్పుడు అందరి మనసులను తొలిచి వేస్తున్న ప్రశ్నలు.

 ఈఎస్ఐ లో అవినీతికి బాధ్యులెవరు ?

ఈఎస్ఐ లో అవినీతికి బాధ్యులెవరు ?

ఈఎస్ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు 150 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని పేర్కొన్నారు.అయితే ఈఎస్ఐలో జరిగిన అవినీతికి ఆయన ఇచ్చిన సిఫార్సు లేఖకు ఉన్న సంబంధాన్ని ఏసీబీ అధికారులు స్పష్టంగా చెప్పలేదు. ఇక అసలు విషయానికి వస్తే మంత్రి హోదాలో సిఫార్సు చేసినప్పటికీ నిబంధనలు పాటించి నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం అధికారులే అన్న అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. మరికొందరు మంత్రి హోదాలో చెప్పినప్పుడు,అధికారులు మాత్రం ఏం చేయగలరు? ఈ అవినీతికి మాజీమంత్రి బాధ్యులు అని భిన్న వాదనలు వినిపిస్తున్నారు.

ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఏంటి ?

ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఏంటి ?

ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారంలో ప్రధానమైన ప్రశ్న మాత్రం ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఏంటి ? నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఖరారు చేయించారని, టెలి హెల్త్ సర్వీస్ ల పేరుతో ఆర్డర్లు ఇప్పించారని, అసలు మనుగడలో లేని కంపెనీల నుండి నకిలీ కొటేషన్లు సృష్టించారని, రేట్ కాంట్రాక్ట్ లేని కంపెనీలకు 50 కోట్ల రూపాయల చెల్లింపు చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్తున్నారు. ఇందుకు ఆయన సిఫార్సు లెటర్ ఎల్ ఆర్ నెంబర్ 1198 /ఎం( ఎల్ఎఫ్ఎఫ్ , వైఎస్ 5/ 2016 ) తేదీ: 25 -11- 2016 ఇచ్చినట్లుగా ఒకే ఒక్క ఆధారం ఏసీబీ అధికారుల దగ్గర ఉంది. దీని ఆధారంగా ఈఎస్ఐ స్కామ్ అచ్చెన్నాయుడు మెడకు చుట్టుకుంది.

ఈఎస్ఐ కుంభకోణంలో ఎవరి సంపాదన ఎంత ?

ఈఎస్ఐ కుంభకోణంలో ఎవరి సంపాదన ఎంత ?

అయితే ఇందులో ప్రధానంగా అవినీతి ద్వారా ఎవరెవరు ఎంత సంపాదించారు అనే అంశాలను ఏసీబీ రాబట్టిందా? ఈఎస్ఐ మందుల కొనుగోలులో జరిగిన అవకతవకలకు , అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలతో సహా ఏసీబీ వద్ద ఉన్నాయా? ఇక ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు అక్రమంగా ఎలా సంపాదించాడు ? ఆయనకు ఏ రూపంలో డబ్బు చేరింది ? మొత్తం ఆయన సంపాదించిన అక్రమ సొమ్ము ఎంత? ఈ వివరాలు ఏసీబీ అధికారుల వద్ద ఉన్నాయా? ఈ కుంభకోణానికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇచ్చిన నివేదికలో పూర్తి ఆధారాలు ఉన్నాయా ? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఏపి ప్రజలను ఆలోచించేలా చేస్తున్నాయి.

సోదాలు లేకుండానే అరెస్ట్ ల పర్వాలు .. అన్ని ఆధారాలు ఉన్నాయా ?

సోదాలు లేకుండానే అరెస్ట్ ల పర్వాలు .. అన్ని ఆధారాలు ఉన్నాయా ?

ఈఎస్ఐ స్కామ్ లో విచారణ ప్రారంభించిన ప్రభుత్వం ఏసిబిని రంగంలోకి దించింది. అయితే ఏసీబీ అధికారులు సంబంధిత శాఖ అధికారులకు సంబంధించి విచారణ చేయడం గాని, సోదాలు నిర్వహించడం కానీ ఇప్పటివరకు చేయలేదు. అక్రమ లావాదేవీలను గుర్తించినట్టు ప్రకటించకుండానే, సడన్ గా అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళారు. ముందుగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారు. ఇక ఈ వ్యవహారంలో టెలీ హెల్త్ సర్వీసెస్ కి కూడా నోటీసులు ఇచ్చినట్లు కనిపించలేదు. అవినీతి జరిగింది అని నోటితో చెబుతున్న మాటలను నిరూపించడానికి కావాల్సిన ఆధారాలు ఈ కేసులో ఉన్నాయా అన్నది పెద్ద ప్రశ్న.

 ఈఎస్ఐ కుంభకోణంలో జరిగింది నిధుల దుర్వినియోగమా ? అవినీతా ?

ఈఎస్ఐ కుంభకోణంలో జరిగింది నిధుల దుర్వినియోగమా ? అవినీతా ?

అవినీతికి పాల్పడిన వారు ఎలాంటి ప్రతిఫలం పొందారు. అది ఏ రూపంలో ఉంది. దానికి సంబంధించిన నగదు బదిలీ కానీ, స్థిరాస్తి బదిలీ కానీ జరిగిందా? అసలు ఇంతకీ ఈఎస్ఐ కుంభకోణంలో జరిగింది నిధుల దుర్వినియోగమా ? అవినీతా ? ఈ విషయంపై కూడా పెద్దగా క్లారిటీ లేదు. ఈఎస్ఐలో కుంభకోణం జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ, మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయడంతో, ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది అనేది అందరూ అంగీకరించే అంశం. మరో ఆసక్తికర విషయం మాత్రం ఈఎస్ఐలో మందుల కొనుగోలుకు సంబంధించి, వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించి ఏ వ్యవహారమైనా ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది ఈఎస్ఐ డైరెక్టర్ లే.

 అచ్చెన్నాయుడు సిఫార్సులను అధికారులు ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు ?

అచ్చెన్నాయుడు సిఫార్సులను అధికారులు ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు ?

రాజకీయ నేతలు జోక్యం చేసుకున్నప్పటికీ, నిబంధనలను అతిక్రమించకుండా పని చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం. కార్మిక శాఖ మంత్రిగా నాడు అచ్చెన్నాయుడు ఉన్నప్పటికీ,ఆయన సిఫార్సు చేసినప్పటికీ వాటిని ఎందుకు అధికారులు పరిగణలోకి తీసుకున్నారు అనేది ఒక వాదన.ఈఎస్ఐ లో నిర్ణయం తీసుకునే నిర్ణయాధికారం మంత్రికి లేదని, కేవలం సిఫార్సులు మాత్రమే చేయడానికి ఆయన అధికారాలు పరిమితమని పేర్కొంటున్న పరిస్థితి ఉంది.

ఏసీబీ అధికారుల దగ్గర అంతగా కీలక ఎవిడెన్స్ ఏముంది ?

ఏసీబీ అధికారుల దగ్గర అంతగా కీలక ఎవిడెన్స్ ఏముంది ?

సహజంగా మంత్రులు ఏ శాఖలో అయినా చాలా విషయాలలో, చాలా వ్యవహారాలలో సిఫార్సు లేఖలు ఇస్తారు. ఇక వాటిని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా ఉన్నతాధికారుల కాబట్టి ఒక్క సిఫార్సు లేఖ ఆధారంగా అచ్చెన్నాయుడు అవినీతి చేశారని ఎలా నిరూపిస్తారు అన్నది ఏపీ టీడీపీ నేతల మనసులో మెదులుతున్న ప్రశ్న. ఇక ఈ వ్యవహారంలో ప్రభుత్వం దగ్గర అంతగా కీలక ఎవిడెన్స్ ఏముంది ? అన్న టెన్షన్ కూడా ప్రతిపక్ష నాయకుల్లో కనిపిస్తుంది . ఇక ఇప్పటికే అనేకమార్లు చాలా విషయాల్లో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. కనీసం ఇందులో అయినా ఏసీబీ అధికారులు, ప్రభుత్వం సక్సెస్ అవుతుందా? అసలేం జరుగుతోంది? అన్నది ఏపీలో ఇప్పుడు బిగ్ డిబేట్ గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+