విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేశినేని నానికి త‌త్వం బోధ‌ప‌డిందా? భ‌విష్య‌త్తు క‌న‌ప‌డుతోందా?

|
Google Oneindia TeluguNews

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని ఇటీవ‌ల కాలంలో త‌రుచుగా వార్త‌ల్లో నిలుస్తున్నారు. త‌న‌కు పోటీగా విజ‌య‌వాడ‌లో మ‌రో రాజ‌కీయం న‌డుస్తోంద‌ని, త‌న సోద‌రుడిని కొంద‌రు నేత‌లు ప్రోత్స‌హిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డుతున్నారు. ఇదే క్ర‌మంలో పార్టీపైన‌, అధినేత చంద్ర‌బాబుపైన ప‌రుష‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో స‌మావేశంలో పాల్గొన‌డానికి వ‌చ్చిన బాబుకు బొకే ఇచ్చే విష‌యంలో నాని ప్ర‌వ‌ర్త‌న వివాదాస్ప‌ద‌మైంది. సొంత పార్టీ అధినేత‌తో అలా వ్య‌వ‌హ‌రించ‌డంపై రాష్ట్ర‌వ్యాప్తంగా తెలుగు త‌మ్ముళ్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 ఛానెళ్లపై నెట్టేసిన కేశినేని

ఛానెళ్లపై నెట్టేసిన కేశినేని

యూట్యూబ్ కు పోటీగా కొన్ని మీడియా ఛాన‌ళ్లు త‌మ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవ‌డానికి మాత్ర‌మే ఇలాచేశాయ‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి నాని పార్టీపై ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా నాయ‌కుల‌వెరూ సీరియ‌స్‌గా తీసుకోలేదు. అధినేత చంద్రబాబు, లోకేష్ కూడా నాని కుమార్తె వివాహానికి హాజ‌ర‌య్యారు. ఆ త‌ర్వాతే ఢిల్లీ సంఘ‌ట‌న జ‌రిగింది. పూల బొకేను విసిరికొట్ట‌బోయినంత ప‌నిచేసిన కేశినేని నాని వ్య‌వ‌హార‌శైలిపై రాష్ట్ర‌వ్యాప్తంగా తెలుగు త‌మ్ముళ్లు తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేశారు. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యాన్ని ఉల్లంఘించే ఈ త‌ర‌హా నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ డిమాండ్లు ప్రారంభ‌మ‌య్యాయి. నాని ప్ర‌వ‌ర్త‌నా తీరుపై ఇంత‌వ‌ర‌కు బాబు స్పందించ‌లేదు.

 వెనక్కి తగ్గిన నాని

వెనక్కి తగ్గిన నాని

తాను ఎలాంటి విష‌యాల్లోను జోక్యం చేసుకోన‌ని అన్నారు. ఎవ‌రూ త‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌లేర‌న్నారు. కానీ పార్టీనాయ‌కుల‌పై ప‌దునైన విమ‌ర్శ‌లు చేసిన నానికి ఇప్పుడు భ‌విష్య‌త్తు క‌న‌ప‌డుతోంది. కుమార్తెను మేయ‌ర్‌గా చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఆమె వార్డు స‌భ్యురాలిగా గెలిచిన‌ప్ప‌టికీ ఉప‌యోగం లేకుండా పోయింది. మ‌రోవైపు త‌న సోద‌రుడిని పార్టీలోని మ‌రోవ‌ర్గం నేత‌లు త‌న‌కు పోటీగా విజ‌య‌వాడ ఎంపీగా పోటీచేయించడానికి ప్ర‌య‌త్నాలు సాగించార‌ని, అందుకు చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌నే అనుమానంలో నాని ఉన్నారు. అప్ప‌టినుంచే ఆయ‌న పార్టీపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. రాజకీయంగా తాను బలహీనపడకుండా ఉండేందుకు ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

Recommended Video

''అతను'' ఎట్టి పరిస్థితుల్లోను అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు? *AndhraPradesh | Telugu OneIndia
 నాని కంటే బలమైన అభ్యర్థులే ఉన్నారు?

నాని కంటే బలమైన అభ్యర్థులే ఉన్నారు?

ఢిల్లీలో అధినేత‌తో తాను వ్య‌వ‌హ‌రించిన విధానంపై రాష్ట్ర‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు రావ‌డంతో దాన్ని చ‌క్క‌దిద్దుకునే ప‌నిలో ప‌డ్డారు. తాను పార్టీ కోసమే పనిచేస్తానని, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోనని ప్రకటించారు. ప్ర‌స్తుతానికి విజ‌య‌వాడ నుంచి తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున పోటీచేయ‌డానికి అభ్య‌ర్థులెవ‌రూ లేరు.. రారు అనే అపోహలో ఆయ‌న ఉన్నార‌ని, పార్టీ కావాలనుకుంటే నాని కంటే బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌గ‌ల‌ద‌ని తెలుగు త‌మ్ముళ్లు చెబుతున్నారు. పార్టీకి కావ‌ల్సింది క్ర‌మ‌శిక్ష‌ణ అని, దాన్ని అర్థం చేసుకొని కొనసాగగలిగితే ఎటువంటి అవ‌రోధాలు ఎదురుకావాలని పార్టీ శ్రేణులు కేశినేని నానికి సూచిస్తున్నాయి.

English summary
Nani's behavior in giving a bouquet to Babu, who came to participate in a meeting in Delhi, became controversial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X