అనుకూల తీర్పు: ప్రతిఫలం గవర్నర్ పదవా..!
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివంను కేరళ గవర్నర్‌గా నియమించాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. గతంలో అమిత్ షా కేసులో జస్టిస్ సదాశివం ఇచ్చిన తీర్పునకు ప్రతిఫలమా అంటూ ప్రశ్నించింది. కేరళ గవర్నర్‌గా పనిచేసిన షీలా దీక్షిత్ ఇటీవల రాజీనామా చేసింది. ఈ పదవిలో జస్టిన్ సదాశివంను నియమించాలని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది.
కేరళ గవర్నర్‌గా జస్టిస్ సదాశివంను నియమించాలన్న కేంద్రం సిపార్సులపై రాజకీయంగా తీవ్ర చర్చకు తెరలేచింది. కేరళ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్‌కు చెందిన 117 మంది న్యాయవాదులు జస్టిస్ సదాశివం నియామకంపై సిపార్సులను తోసిపుచ్చాలని రాష్ట్రపతికి విన్నవిస్తూ తీర్మానం చేశారు.

మాజీ ప్రధాన న్యాయమూర్తిని గవర్నర్‌గా నియమిస్తే న్యాయవ్యవస్ద స్వతంత్రతపై ప్రభావం చూపుతుందని కేరళ హైకోర్టు హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సెక్రటరీ నందకుమార్ పేర్కొన్నారు. ఇలాంటి నియామకాల వల్ల న్యాయవ్యవస్దలో రాజకీయాల ప్రభావం పెరుగుతుందని మరో మాజీ ప్రధాన న్యాయమూర్తి వీఎన్ ఖరే పేర్కొన్నారు.
అమిత్ షా నకిలీ ఎన్ కౌంటర్ కేసు:
గుజరాత్ రాష్ట్ర మాజీ హోం మంత్రిగా అమిత్ షా ఉన్నప్పుడు 2005వ సంవత్సరం సోహ్రాబుద్దీన్ షేక్, ఆతని సతీమణి కౌసర్ బి కిడ్నాపింగ్ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు అమిత్ షాకి క్లీన్ చీట్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications