ఒరిగేదేమీ ఉండదనే, గొడవలు తాత్కాలికమే: నారాయణ

హైదరాబాద్: వామపక్షాల మధ్య విబేధాలు తాత్కాలికమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం వల్ల ఒరిగేది ఏమీ ఉండదనే దానికి ముగింపు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. బుధవారం ముఖ్దుంభవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల్లో ప్రజా నాడిని గుర్తించడంలో విఫలమయ్యాయని అన్నారు. రెండు రోజుల్లో వేర్వేరు రాష్ట్రాలకు రెండు కమిటీలను నియమిస్తామని ఆయన తెలిపారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు తమ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నట్లు ఆయన చెప్పారు.

Differences with CPM will not continue: narayana

రెండు పార్టీల మధ్య విబేదాలు వచ్చిన మాట వాస్తవమేనని, పరిష్కారం చేసుకోడానికి అనేక రకాల దారులు ఉన్నాయని నారాయణ తెలిపారు. చీకటి ఒప్పందాలు గానీ, మరో రకం ఒప్పదాలు గానీ ఏమైనా గానీ నిరూపించడం సాధ్యంకాదని నారాయణ అన్నారు.

జరిగింది వాస్తవమే అయినా అది నిరూపించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. నిరూపించలేని వాటిపై మాట్లాడడం సరికాదు కాబట్టి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు నారాయణ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+