ఏందయ్యా జగనూ... ఏపీలో హీటెక్కిస్తున్నావ్ గా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విచిత్రమైన వాతావరణం నెలకొంది. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు చినుకులు పడుతున్నాయంటేనే హడలిపోతున్నారు. ఆ చినుకులు రాలినంతసేపే వాతావరణం చల్లగా ఉంటోంది. తర్వాత రోహిణీకార్తెను తలపించే ఎండలతో అల్లాడిపోతున్నారు. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో పూర్తిగా నిష్క్రమిస్తాయి. అందువల్లే వాతావరణం ఇలా ఉందని నిపుణులు చెబుతున్నారు.
అక్టోబరు హీటింగ్ : ఈ ఏడాది లోటు వర్షపాతమే నమోదైంది. తీవ్రమైన వర్షాభావంతో మెట్ట ప్రాంతాల్లోని పంటలన్నీ ఎండిపోతున్నాయి. వాస్తవానికి ఈశాన్య రుతుపవనాలు అక్టోబరులో మొదలవుతాయి. ప్రస్తుతం నెలకొన్న వాతావరణాన్ని 'అక్టోబరు హీటింగ్'గా అభివర్ణించారు. నైరుతి నిష్క్రమించి, ఈశాన్య రుతుపవనాలు ప్రారంభంలో గాలుల దిశ మారి, సముద్రంలో అధిక పీడనం కొనసాగుతుంది. దీంతో భూ ఉపరితలంపైకి తేమగాలులు వీచి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కానీ, ఈ సంవత్సరం భిన్నమైన వాతావరణం నెలకొంది.

అధిక పీడనంవల్ల: మధ్యభారతంలో అధికపీడనం కారణంగా భూఉపరితలంపై నుంచి గాలులు వీస్తుండటం వల్ల రాష్ట్రంలో తేమతగ్గి పొడి వాతావరణం ఏర్పడింది. పదిరోజుల నుంచి ఇదే వాతావరణం. ఈ తరహా వాతావరణాన్ని చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపటికి నైరుతి రుతుపవనాలు మనదేశం నుంచి పూర్తిగా వైదొలుగుతాయని వాతావరణ విభాగం నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి వాతావరణం ప్రతికూలంగా ఉందని, ఈశాన్య గాలులు వీయడంతో వర్షాలుండంటున్నారు. అక్టోబరు 19 వరకు బంగాళాఖాతంలో ఎటువంటి ఉపరితల ఆవర్తనాలు ఏర్పడే అవకాశం లేదని, ఈనెల 20 లేదా 21వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉండొచ్చని, అది కూడా పూర్తిగా చెప్పలేమంటున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాలో అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగత్ర నమోదయ్యింది.












Click it and Unblock the Notifications