మీ ఇష్టం: కిరణ్‌కు డిగ్గీ కౌంటర్, ప్లేన్‌లో ఢిల్లీకి టి నివేదిక

తెలంగాణ ఏర్పాటుకే తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఈ నిర్ణయం ఇష్టం లేకుంటే తనకు తోచిన నిర్ణయం ఏదైనా సరే తీసుకునే స్వేచ్ఛ ముఖ్యమంత్రికి ఉందని చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయంలో మార్పు ఉండదన్నారు. కేంద్రమంత్రులు అవినీతిపరులన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలపై స్పందిస్తూ.. ఆయన వద్ద సాక్ష్యాలు ఉన్నాయా, ఉంటే కోర్టుకు సమర్పించాలి లేదంటే క్షమపాణ చెప్పాలన్నారు.
తన హయాంలోనే గుజరాత్ అభివృద్ధి చెందిందని చెబుతున్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన మండిపడ్డారు. మోడీ ఒక అబద్దాల పుట్ట అన్నారు. అవినీతి కేసు నుండి బయటపడని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను తిరిగి బిజెపిలో చేర్చుకోవడంపై ఆ పార్టీ నాయకత్వం ఏం చెబుతుందన్నారు.
ఢిల్లీకి విభజన బిల్లు చర్చల నివేదిక
మరోవైపు తెలంగాణ ముసాయిదా బిల్లు పైన జరిగిన చర్చపై నివేదిక సోమవారం ఉదయం ఢిల్లీకి చేరింది. ఎయిర్ ఇండియా విమానంలో నివేదికను అధికారుల బృందం ఢిల్లీకి తీసుకెళ్లింది. బిల్లు కాపీలతో ఉప కార్యదర్శి లలితాంబిక నేతృత్వంలో తొలి బృందం ఢిల్లీ చేరింది. మరికొన్ని బిల్లు ప్రతులతో జిఏడి అధికారులు బయలుదేరారు. విభజన బిల్లుపై శాసన సభలో జరిగిన చర్చపై నివేదిక ఆదివారం రాత్రి సిద్ధమైంది. మూడు రోజుల కసరత్తు అనంతరం సమగ్ర నివేదికను రూపొందించారు. మరోవైపు నేతలు కూడా ఢిల్లీకి క్యూ కట్టారు.












Click it and Unblock the Notifications