బంపర్ ఆఫర్: నెలకు రూ.2 కోట్ల వేతనంతో ఆపిల్ లో ఉద్యోగం

Posted By:
Subscribe to Oneindia Telugu

పెద్దాపురం:మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఓ యువకుడు తన కలలను సాకారం చేసుకొన్నాడు. ఏకంగా రెండు కోట్ల వేతనంతో ఆపిల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు.గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులు కూడ పట్టణ ప్రాంతానికి చెందిన యువకుల ఏ మాత్రం తీసిపోరని నిరూపించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దిలీప్.

ప్రపంచ వ్యాప్తంగా సాప్ట్ వేర్ రంగం మాంద్యంలో ఉంది.అయితే ఈ తరుణంలో ఆపిల్ కంపెనీలో నెలకు రూ.2 కోట్ల వేతనం సంపాదించడం అంత ఆషామాషీ వ్యవహరం కాదు.అయితే తన లక్ష్యసాదన కోసం ఆయన అనుకొన్నట్టుగా దూసుకెళ్ళాడు. అనుకొన్నది సాధించాడు.

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామానికి చెందిన దుర్గాలక్ష్మీనారాయణస్వామి అలియాస్ దిలీప్ ఈ ఘనతను సాధించారు. తండ్రి సుబ్బారావు పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తాడు. అయితే తన పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేశాడు సుబ్బారావు.

దిలీప్ అత్యధిక వేతనం తీసుకొనే ఉద్యోగానికి ఎంపికైన విషయం తెలుసుకొన్న స్థానికులు ఆ కుటుంబాన్ని అభినందనల్లో ముంచి తేలుస్తున్నారు. దిలిప్ ఈ తరం యువతకు ఆదర్శంగా నిలిచాడు.

బాల్యం నుండే దిలీప్ చదువుపై శ్రద్ద

బాల్యం నుండే దిలీప్ చదువుపై శ్రద్ద

సుబ్బారావుకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు దిలీప్, రెండో కుమారుడు సుబ్రమణ్య శివప్రసాద్. చిన్నప్పటి నుండి దిలీప్ చదువుపై ఎంతో ఆసక్తిని చూపించేవాడు. అయితే ఈ చదువుకు తగ్గట్టుగానే తల్లిదండ్రులు కూడ దిలీప్ ను ప్రోత్సహించారు. పదోతరగతితో కూడ ఫ్టస్ క్లాస్ లో ఉత్తీర్ణుడయ్యాడు.చిన్నతనం నుండే కవితలు రాయడం చేసేవాడు. మరో వైపు ఉన్నతవిద్యలో భాగంగా అమెరికా వర్జీనియా టెక్ లో ఎంఎస్ విద్యాభ్యాసం పూర్తి చేసి అకడమిక్ బ్యాక్ గ్రౌండ్ లో ప్రతిభను చూసి ఆపిల్ సంస్థ ఐఫోన్స్ , ఇతర ఉత్పత్తులపై అత్యధిక జీతం రూ.2,85 వేల డాలర్లు( రెండు కోట్లు) ఇస్తానని ఆఫర్ ఇచ్చింది.ఈ నెల 22న, ఆయన ఈ ఉద్యోగంలో చేరనున్నారు.

కొడుకుల చదువుకోసం కష్టపడిన కుటుంబం

కొడుకుల చదువుకోసం కష్టపడిన కుటుంబం

సుబ్బారావు తన ఇద్దరు కొడుకులను చదివించేందుకు కష్టపడ్డాడు. సుబ్బారావు ఇంటర్మీడియట్ విద్యార్హతతో పోస్ట్ మాస్టర్ ఉద్యోగం సంపాదించాడు. 1988 లో రూ.350 జీతంతో ఆయన ఈ ఉద్యోగంలో చేరాడు. అయితే అదే బ్రాంచీలో ఇంకా సుబ్బారావు పనిచేస్తున్నాడు. తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చిన మూడెకరాల భూమిలో రెండు ఎకరాలు అమ్మేసీ సుబ్బారావు ఇల్లు కట్టుకొన్నాడు.అయితే ఎన్ని కష్టాలొచ్చినా కాని ఆయన తన కొడుకల చదువు విషయంలో మాత్రం రాజీపడలేదు.

 గ్రామస్థుల ఆనందం

గ్రామస్థుల ఆనందం

సాధారణ పాఠశాలల్లో చదివి అసాధారణ ప్రతిభ కనబరిచిన దిలీప్ ను గ్రామస్థులు అభినందిస్తున్నారు. తమ గ్రామం పేరును దిలీప్ ప్రపంచం మార్మోగించేలా ప్రయత్నాలు చేశారని గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారుఅయితే విద్యతో సాధించలేనిది ఏమీలేదని నిరూపించాడు దిలీప్.

రెండో కొడుకు ఇన్పోసిస్ లో ఉద్యోగం

రెండో కొడుకు ఇన్పోసిస్ లో ఉద్యోగం

విద్యతో ఏదైనా సాధించవచ్చని ఈ ఇద్దరూ కూడ నిరూపించారని గ్రామస్థులు అభిప్రాయంతో ఉన్నారు. దిలీప్ ఆయన సోదరుడు సుబ్రమణ్య శివప్రసాద్ కూడ విద్యలో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూనే ఉన్నారు.దిలీప్ మాదిరిగానే శిప్రసాద్ కూడ సాప్ట్ వేర్ రంగంలోనే ఉద్యోగం సంపాదించాడు. చెన్నైలోని ఇన్పోసిస్ లో శివప్రసాద్ పనిచేస్తున్నాడు.సుబ్బారావు దంపతులకు వివాహమై 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా దిలీప్ ఆ దపంతులకు 10 లక్షల విలువైన కారును బహుమతిగా పంపాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
dileep got a job in Apple i phone company best salary package. he will be join in apple company.Apple will be paid to him every month Rs.2 crore for salary.
Please Wait while comments are loading...