గుంటూరు కారం నుంచి తప్పుకుంటున్న త్రివిక్రమ్ శ్రీనివాస్?
ఏ ముహూర్తాన ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టారో కానీ గుమ్మడికాయ ఎప్పుడు కొడతారా? అని మహేష్ బాబు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బ్రో సినిమాకు పనిచేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువ సమయం తీసుకోవడంతో గుంటూరు కారం షూటింగ్ వాయిదా పడింది. ఆ వాయిదా వాయిదా.. చివరకు సినిమా పూర్తవుతుందా? మధ్యలోనే ఆగిపోతుందా? అనే అనుమానం అందరిలో వ్యక్తమవుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్ గుంటూరు కారం నుంచి తప్పుకున్నారు. కారణాలు తెలియరాలేదు. ఆయన స్థానంలో మరో సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ ను తీసుకున్నారు. వినోద్ తో త్రివిక్రమ్ కు మంచి అనుబంధం ఉంది. అరవింద సమేత, అల వైకుంఠపురంలో, వకీల్ సాబ్ సినిమాలకు కలిసి పనిచేశారు. ఆ అనుబంధంతోనే గుంటూరు కారం సినిమాకు కూడా తీసుకున్నారు. ఎందుకు మధ్యలో నుంచి తప్పుకున్నారు అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు.

13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మహేష్ బాబు - త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా రాబోతోందంటే ప్రిన్స్ అభిమానులు ఎంతో ఆనందపడ్డారు. కానీ ఈ సినిమాకు మొదటి నుంచి అవాంతరాలే ఎదురవుతున్నాయి. దీనికి కారకుడు త్రివిక్రమ్ శ్రీనివాసేనంటూ అభిమానులు మండిపడుతున్నారు. పూజాహెగ్డే తప్పుకోవడంతో ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి వచ్చారు. థమన్ కూడా తప్పుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయికానీ వాటిని అతను ఖండించాడు. తాజాగా వినోద్ కూడా తప్పుకోవడంతో మిగిలింది త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కడేనని, అతను కూడా త్వరలోనే తప్పకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారు. వినోద్ తప్పుకోవడానికి నాలుగు రోజుల ముందే మహేష్ బాబు అకస్మాత్తుగా షూటింగ్ ఆపేసి కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లాడు.












Click it and Unblock the Notifications