పదో తరగతి పరీక్షల షెడ్యూల్ మార్పు - కొత్త డేట్స్ ఇవే: పరీక్షల మధ్య గ్యాప్ ..!!

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ మారింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. కొత్త పరీక్షా తేదీలను వెల్లడించింది. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. మారిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 27న తెలుగు పరీక్ష జరగనుంది. ఏప్రిల్ 28న సెకండ్ లాంగ్వేజ్‌ నిర్వహిస్తారు. ఏప్రిల్ 29న ఇంగ్లిష్‌ పరీక్ష జరగనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక, మే 2న గణితం పరీక్ష జరుగుతుంది. మే 4న సైన్స్‌ పేపర్‌-1 నిర్వహిస్తారు. మే 5న సైన్స్‌ పేపర్‌-2 పరీక్ష ఉంటుందని వెల్లడించారు. మే 6న సాంఘికశాస్త్రం పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది.

మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే రెండో తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నాయి. వీటిని మార్చుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్షల కారణంగా ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే మార్పు చేసారు.మారిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు జరుగుతాయి. పదో తరగతి పరీక్షలు తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు జరగనున్నాయి. ఒకేసారి ఇంటర్‌, పది పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలకు పోలీసు బందోబస్తు, ఆరోగ్య సిబ్బంది, పరీక్ష కేంద్రాలు, ఇతరాత్ర సమస్యలు ఏర్పడుతున్నందున పది పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Directorate of school edcuation released SSC Exams Rescheule dates

కొత్త షెడ్యూల్‌ను ప్రభుత్వ అనుమతివ్వటంతో ప్రకటన జారీ అయింది. మొదటిసారిగా పదో తరగతి విద్యార్థులకు ఏడు పరీక్షలే నిర్వహిస్తున్నందున పరీక్ష... పరీక్షకు మధ్య ఒకటి, రెండు రోజులు విరామం ఇవ్వనున్నారు. పాఠశాలల ఒంటిపూట నిర్వహణను విద్యాశాఖ ఈసారి వాయిదా వేసింది. సాధారణంగా మార్చి 15 నుంచే ప్రారంభం అవుతాయి. కరోనా కారణంగా ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడుల నిర్వహణను వాయిదా వేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఏప్రిల్‌లో ఒంటిపూట బడులపై నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+