వైఎస్ కుటుంబంతో విబేధాలు, చెన్నారెడ్డి ఒప్పుకోలేదు: కందుల రాజమోహన్ రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని మంత్రిని చేయాలని వైఎస్ రాజారెడ్డి మా నాన్న ఓబుల్‌రెడ్డిని అడిగేవాడు. అయితే చెన్నారెడ్డి మాత్రం కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన యువకుడిని ఎలా మంత్రిని చేస్తామని దాట వేశాడని చెప్పేవారని బిజెపి నేత కందుల రాజమోహన్ రెడ్డి చెప్పారు. ఈ కారణంగానే వైఎస్‌ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య విబేధాలు ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేసుకొన్నారు.

నా సోదరుడిని ఓడించాడు, వైఎస్ఆర్‌పై పోటీ, ముందే చెప్పా: కందుల రాజమోహన్ రెడ్డి

ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను రాజమోహన్‌రెడ్డి పంచుకొన్నారు. వైఎస్ కుటుంబంతో తమ కుటుంబానికి ఏర్పడిన విబేధాలకు కారణాలతో పాటు ఆనాడు జిల్లా రాజకీయాలను కూడ కందుల రాజమోహన్ రెడ్డి ప్రస్తావించారు.

వైఎస్ కుటుంబంంతో ఏర్పడిన విబేధాల పరిష్కారం కోసం ఒక్కసారి ప్రయత్నాలు జరిగాయని ఆయన చెప్పారు. ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య వివాదాల పరిష్కారం కోసం ఎలాంటి .ప్రయత్నాలు జరగలేదని కందుల రాజమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

నాన్న కోరిక మేరకు రాలేదు, పవన్‌ అంటే అభిమానం: భూమా అఖిలప్రియ సంచలనం

వైఎస్ కుటుంబంతో విబేధాలు

వైఎస్ కుటుంబంతో విబేధాలు

వైఎస్ కుటుంబంతో తమ కుటుంబానికి విబేధాలు రావడానికి వైఎస్ఆర్‌కు మంత్రి పదవి విషయమే కారణమని కందుల రాజమోహన్‌రెడ్డి చెప్పారు.1978లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారని చెప్పారు. అయితే ఆ సమయంలో సీఎంగా ఉన్న చెన్నారెడ్డి మాత్రం కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తికి మంత్రిపదవిని ఎలా ఇస్తామని దాటవేసేవారని గుర్తు చేసుకొన్నారు. ఈ కారణంగానే వైఎస్ కుటుంబానాకి మా కుటుంబానికి మధ్య విభేధాలు ఏర్పడ్డాయని చెప్పారు.

మంత్రి పదవి కోసమిలా

మంత్రి పదవి కోసమిలా

1978లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రెడ్డి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మా నాన్న సమర్థించారని కందుల రాజమోహన్‌రెడ్డి గుర్తు చేసుకొన్నారు. ఆ ఎన్నికల్లో వైఎస్ విజయం సాధించిన తర్వాత వైఎస్ రాజారెడ్డి మంత్రి పదవి కోసం తన తండ్రి ఓబుల్‌రెడ్డి మీద ఒత్తిడి తీసుకువచ్చేవారని రాజమోహన్‌రెడ్డి గుర్తు చేసుకొన్నారు. అయితే ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మాత్రం ఇంకా టైముందంటూ చెప్పేవారని ఆయన గుర్గు చేశారు.

రెండు కుటుంబాల మధ్య రాజీ జరిగింది

రెండు కుటుంబాల మధ్య రాజీ జరిగింది

1985లో మా నాన్న ఓబుల్ రెడ్డి ఎంపీగా పోటీ చేసిన సమయంలో వైఎస్ కుటుంబంతో రాజీ ప్రయత్నాలు జరిగాయని కందుల రాజమోహన్ రెడ్డి చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో మా నాన్న ఓడిపోయారని ఆయన చెప్పారు. ఆ తర్వాత వైఎస్ కుటుంబంతో ఇక ఏనాడూ రాజీ ప్రయత్నాలు జరగలేదని కందుల రాజమోహన్ రెడ్డి గుర్గు చేశారు.

  Chandrababu targts Jagan with Kadapa district జగన్‌పై చంద్రబాబు వ్యూహం, కడప టార్గెట్
  1977లో నాన్న ఎంపీ

  1977లో నాన్న ఎంపీ

  1977లో మా నాన్న ఓబుల్ రెడ్డి కడప ఎంపీగా ఉండేవారని కందుల రాజమోహన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే కడప జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారని చెప్పారు. కడప జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  BJP leader Kandula Rajamohan Reddy said that since 1978 our family has disagreements with the YS family. A Telugu news channel interviewed him.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి