పెరిగిన వంటనూనెల ధరలు, గ్యాస్ సిలిండర్ల రేట్లు ఇక..!?
నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే వంట నూనెల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. పాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ రోజు లేదా రేపు అధికారికంగా ప్రకటన వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వరుసగా పెరుగుతున్న ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
నిత్యవసరాల ధరలు ఒక దాని తరువాత మరొకటి పెరుగున్నాయి. అమూల్, మదర్ డెయిరీలు తమ పాల ధరలను అమాంతం పెంచుతూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాయి. సంస్థలు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ కొత్త ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. అదే విధంగా.. వంట నూనె ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులకు భారంగా మారుతున్నాయి. నెల రోజుల కాలంలో పెరిగిన ధరలు మోయలేని భారంగా మారాయి. ఒకే సారి లీటర్‌పై రూ. 30 వరకు పెరిగాయి. నెల రోజుల్లోనే కిలో నూనె ధర ఏకంగా 22 శాతం పెరిగింది. పలు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న వంట నూనెల ధరలు పరిశీలిస్తే సన్‌ప్లవర్ ఆయిల్ రూ. 180 నుంచి రూ. 200, పామాయిల్ రూ. 120 నుంచి రూ. 145, వేరు శనగ నూనె రూ. 15 నుంచి రూ.20 కు చేరింది. 5 కిలోల డబ్బా రూ.1000 నుంచి రూ. 1150లకు, 15 కిలోల టిన్ను ('హోల్‌సేల్) రూ. 2300 నుంచి రూ. 2400 వరకు పెరిగింది.

పెరుగుతున్న నిత్యాసవరాలతో
అదే విధంగా రైస్ బ్రౌన్ నూనె ధర లీటర్ రూ. 150 నుంచి రూ. 165లకు పెరిగింది. వనస్పతి అయిల్ లీటరు రూ. 130 నుంచి రూ. 160, సోయాబీన్స్ ఆయిల్ రూ. 150 నుంచి రూ. 170కి చేరింది. ఆవ నూనే రూ .130 నుంచి రూ. 160కి చేరింది. వంట నూనేల ధరలు ఇలా పెరగటం సామాన్యులకు భారంగా భారింది. ఇక, మరో వైపు పెట్రో బాంబ్ జనం నెత్తిన వేయటానికి రంగం సిద్దం అవుతోంది. ఇప్పటికే ఆయల్ కంపెనీలు ఈ మేరకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు సమర్పించాయి. కొద్ది రోజుల క్రితం వంట గ్యాస్ ధరలు పెంచిన కేంద్రం.. ఆ తరువాత వరుసగా వాణిజ్య సిలిండర్ల ధరలను భారీగా పెంచు తూ నిర్ణయాలు తీసుకుంది. కాగా.. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే లీటరు పెట్రోల్ ధర రూ. 4 నుంచి రూ. 5 వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ ఎల్పీజీ (LPG) సిలిండర్ ధర కూడా రూ. 40 నుండి రూ. 50 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. చమురు ధరల పెరుగుదల కేవలం వాహనదారులకే కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయని అంచనా వేస్తన్నారు.













Click it and Unblock the Notifications