అల్పపీడనం - ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎండలు - అకాల వర్షాలతో పలు జిల్లాల్లో విచిత్రంగా మారింది. ఇదే సమయంలో వర్షాల పైన వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక, ఎండ తీవ్రత పెరుగుతోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

అల్పపీడనం
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పిలు జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంత పురం, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అదే విధంగా రేపు (శుక్రవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీ పురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

disaster-management-alerts-ap-districts-on-rains-in-next-two-days

భారీ వర్షాలు
అదే విధంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో వైపు ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో భారీగా నమాదు అవుతున్నాయి. కర్నూలు జిల్లా ఉలిందకొండలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా దరిమడుగలో 40.3 డిగ్రీలు, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 40.1 డిగ్రీలు, కడప జిల్లా అమ్మలమడుగులో 39.9 డిగ్రీలు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేటలో 38.7, అమ వతి లో 38.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతల నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అటు.. తెలంగాణలోనూ భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి.

పొడి వాతావరణం
ఉత్తర భారత నుంచి దక్షిణ భారతం వైపు పొడి వాతావరణంతో కూడిన ఈదురు గాలులు వీస్తున్నా ని వాతావారణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమం పెరిగే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ రోజు, రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని పేర్కొంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. అనంతరం ఉత్తర, ఈశాన్య దిశగా తిరిగి ఇది బంగాళాఖాతంలో బలహీనపడు దని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేడు కూడా అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+