మోడీపై కాంగ్రెస్ ప్లాన్ రివర్స్, డిసెంబర్ 31 నుంచి ఇక కష్టాలే: వెంకయ్య

డిసెంబర్ 31వ తేదీ తర్వాత అక్రమంగా డబ్బులు సంపాదించిన వారికి కష్టాలు ప్రారంభం అవుతాయని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం నాడు అన్నారు.

విజయవాడ: డిసెంబర్ 31వ తేదీ తర్వాత అక్రమంగా డబ్బులు సంపాదించిన వారికి కష్టాలు ప్రారంభం అవుతాయని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం నాడు అన్నారు. ఆ తర్వాత సామాన్యుల కష్టాలు తొలగిపోతాయని చెప్పారు.

విజయవాడలో నిర్వహించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదిన వేడుకల్లో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పేదల జీవితాలు బాగుపడాలని వాజపేయి నిత్యం చెప్పేవారన్నారు.

Dishonest to face ruin after Dec 30, says Venkaiah Naidu

ప్రజలకు సుపరిపాలన అందించడం ద్వారా మాజీ ప్రధాని వాజపేయి అంతర్జాతీయ స్థాయిలో మంచిపేరు తెచ్చుకున్నారన్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ దానిని ఆచరణలో పెడుతున్నారన్నారు. మంచి పనులు చేయడానికి దేశాన్ని బాగుచేయడానికి మోడీ ప్రధాని అయ్యారన్నారు.

అంబానీ, అదానీలను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీయేనని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ పైన కాంగ్రెస్ పార్టీ ప్లాన్ రివర్స్ అయిందన్నారు.అంబానీ, ఆదానీల విషయంలో ప్రధానిని టార్గెట్ చేయాలనకుంటే, వారికే ఎదురు తిరిగిందన్నారు.

డిసెంబర్‌ 31 తర్వాత సామాన్యులు కష్టాలు తొలగి అక్రమంగా డబ్బులు సంపాదించిన వారికి కష్టాలు మొదలవుతాయన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రజలందరూ అలవాటు చేసుకోవాలన్నారు. కాగా, వాజపేయి పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆయన వస్త్రాలు పంపిణీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+