పెళ్లికి ముందు పవన్ కల్యాణ్ ఆమెను ప్రెగ్నెంట్ చేయలేదా..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై దివ్వెల మాధురి సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఆమె కామెంట్స్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణిని కాదని ,దివ్వెల మాధురితో సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయం బయటకు రావడంతో భార్య , కూతుర్లు బహిరంగంగానే దువ్వాడ శ్రీనివాస్‌పై విమర్శలు చేయడంతో పాటు, ఆయన నివాసం ఉంటున్న ఇంటిపై దాడి చేశారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ సహజీవనం వ్యవహారం కోర్టులో నడుస్తోంది.
ఇదిలా ఉంటే శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దివ్వెల మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ తిరుమలలో ప్రత్యక్ష్యమైయ్యారు. గత సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో వీరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి పుష్కరిణి దగ్గర మాధురి ఫొటో షూట్ చేశారు. తిరుమల ఆలయ పరిసర ప్రాంతాల్లో ఫొటో షూట్ చేయడంతో ఆమెపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మాధురిపై కేసు నమోదు చేశారు. దీనిపై దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్‌లో దివ్వెల మాధురి పాల్గొన్నారు.ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్‌తో తన సహజీవనం గురించి క్లారిటీ ఇచ్చారు.

ఇంట్లో భార్యలను పెట్టుకుని దొంగచాటు వ్యవహారాలు నడుపుతున్న వారు కూడా తమపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందంటూ ఆమె కామెంట్స్ చేశారు. ఈ సమయంలో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన కార్యకర్తల నుంచి తనకు తీవ్ర బెదిరింపులు వస్తున్నాయని ఆయన తెలిపారు. తనని హత్య చేస్తానని వారు చెబుతున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ సమయంలో దివ్వెల మాధురి కలుగజేసుకుని పవన్ అభిమానులు తమ బంధాన్ని ప్రశ్నిస్తున్నారని, అసలు వాళ్ల నాయకుడు వైవాహిక జీవితంలో సరిగా ఉన్నారా అంటూ ఆమె ప్రశ్నించారు.
ముగ్గురు భార్యలున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడని మాధురి ప్రశ్నించారు. ఒకరికి డైవర్స్ ఇచ్చి.. మరో మహిళతో లివింగ్ రిలేషన్లో ఉంటూ.. ఇంకో మహిళను ప్రెగ్నెంట్ చేసిన అతడిని డిప్యూటీ సీఎంగా ఎందుకు కూర్చోబెట్టారని ఆమె అన్నారు. అయినా ఈ రోజుల్లో ఎవరు పర్ఫెక్ట్ గా ఉన్నారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని తాము చెప్పడం లేదని, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌నే చెప్పారని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. రేణు దేశాయ్ గతంలో ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. నాతో ఉంటూనే మరో మహిళను పవన్ గర్భవతిని చేశారని తెలిపారు.
ఈ విషయాన్నే దువ్వాడ శ్రీనివాస్ ,దివ్వెల మాధురి గుర్తు చేశారు. అయితే ఇది పవన్ వ్యక్తిగత జీవితమని సదరు యాంకర్ ప్రశ్నించగా, ఇది కూడా తమ వ్యక్తిగత జీవితమే అంటూ దువ్వాడ శ్రీనివాస్ ,దివ్వెల మాధురి గట్టిగానే కౌంటరిచ్చారు. ఈ క్రమంలోనే వారు పెళ్లిపై సంచలన ప్రకటన చేశారు. కోర్టు కేసులు అన్ని ముగిశాక త్వరలోనే అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు. అప్పటి వరకు తాము కలిసే ఉంటామని దివ్వెల మాధురి తెలిపింది. రెండేళ్లుగా మాధురితోనే కలిసి ఉంటున్నానని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. కోర్టు కేసులు క్లియర్ అవ్వగానే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని ఇరువురు క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications