Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ రెడ్డి.. జంగారెడ్డిగూడెం మరణాలు మీవల్లే కదా? కొడాలి నానీ, రోజాలపైనా దివ్యవాణి ధ్వజం

జె ట్యాక్స్ కోసం జనం ప్రాణాలు తీస్తున్న లిక్కర్ డాన్ జగన్ రెడ్డి అంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దివ్యవాణి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పొరపాటున కూడా రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పొద్దని, జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా విక్రయాలతో 25 మంది ప్రాణాలు తీసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అని దివ్యవాణి విమర్శించారు. జగన్ సర్కారు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల జంగారెడ్డి గూడెంలో 25 కుటుంబాలు తీవ్ర దుఃఖంలో ఉన్నాయని దివ్యవాణి మండిపడ్డారు.

ప్రభుత్వ హత్యలను, సహజ మరణాలుగా చిత్రీకరించడం వైసిపి నేతలకే చెల్లు

ప్రభుత్వ హత్యలను, సహజ మరణాలుగా చిత్రీకరించడం వైసిపి నేతలకే చెల్లు


చట్టసభల్లో అసత్యాలు మాట్లాడుతూ ప్రభుత్వ హత్యలను, సహజ మరణాలుగా చిత్రీకరించడం వైసిపి నేతలకే చెల్లుబాటవుతుందని దివ్యవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి నరం లేని నాలుక ఎలా పడితే అలా మాట్లాడుతుందని, అందుకే నిండు అసెంబ్లీ లో జంగారెడ్డిగూడెం మరణాలను సహజ మరణాలు గా జగన్మోహన్రెడ్డి చిత్రీకరించారని దివ్యవాణి మండిపడ్డారు. జంగారెడ్డిగూడెం మరణాలను ఆయన కుటుంబ సభ్యులు మద్యం తాగిన కొన్ని గంటల వ్యవధిలోనే మరణించారని చెప్తుంటే, సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం సహజ మరణాలు గా చిత్రీకరించడానికి చేస్తున్న ప్రయత్నం హాస్యాస్పదంగా అనిపిస్తోందని దివ్యవాణి పేర్కొన్నారు.

కోడి కత్తి డ్రామా అనుకున్నారా?

కోడి కత్తి డ్రామా అనుకున్నారా?


జంగారెడ్డిగూడెం మరణాలను కోడి కత్తి డ్రామా లాగా చిత్రీకరించటం ఈజీ అనుకుంటున్నారా జగన్ రెడ్డి అంటూ దివ్యవాణి ప్రశ్నించారు. గొడ్డలి వేటు గుండెపోటు అంత ఈజీ అనుకుంటున్నారా అంటూ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును గుర్తుచేసి విమర్శించారు దివ్యవాణి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శిరస్సు లేని మొండెం లా ఉందని పేర్కొన్న దివ్యవాణి ప్రభుత్వ అజాగ్రత్త వల్ల జంగారెడ్డిగూడెంలో మరణాలు సంభవిస్తే సహజ మరణాలుగా ఎలా చిత్రీకరిస్తారు అంటూ దివ్యవాణి మండిపడ్డారు.

 కొడాలి నాని, రోజాలపై దివ్యవాణి ఫైర్

కొడాలి నాని, రోజాలపై దివ్యవాణి ఫైర్


కొడాలి నానిని టార్గెట్ చేసిన దివ్యవాణి కొడాలి నాని నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్నాడని.. అందుకే అందరూ ఆయనను ఆయన ఏ పదాన్ని అయితే ఎక్కువగా వాడతారో ఆ పదం తోనే పిలుస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని దివ్యవాణి మండిపడ్డారు. జంగారెడ్డిగూడెం మరణాలకు రోజు సమాధానం చెప్పాలని దివ్యవాణి ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం భజన చేస్తున్న రోజా, ప్రాసతో డైలాగులు రాసుకొచ్చి అసెంబ్లీలో జగన్ కు కితాబిస్తున్న రోజా జంగారెడ్డిగూడెం మరణాలపై జగన్ ను నిలదీయాలి అంటూ దివ్యవాణి ప్రశ్నించారు.

 వైయస్ షర్మిల ఏపీ రావాలి

వైయస్ షర్మిల ఏపీ రావాలి


వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ క్యాలెండర్ కోసం పోరాటం చేయడం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని దివ్యవాణి గుర్తు చేశారు. బాబు పోతే జాబ్ వస్తుందని గతంలో ప్రచారం చేస్తున్న వైయస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు వస్తారు అంటూ ప్రశ్నించారు దివ్యవాణి.

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలది దౌర్భాగ్యమైన పరిస్థితి

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలది దౌర్భాగ్యమైన పరిస్థితి


మద్యపానం నిషేధం చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పిన వైయస్ జగన్మోహన్ రెడ్డి మద్యం ధరల రేట్లను విపరీతంగా పెంచి ప్రజలు చీప్ లిక్కర్ తాగేలా, కల్తీ నాటు సారా తాగి చనిపోయేలా చేశారని దివ్యవాణి మండిపడ్డారు. జంగారెడ్డి గూడెం లో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించలేదని మండిపడిన దివ్యవాణి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారు అంటూ ఎద్దేవా చేశారు.

 యధా రాజా తదా ప్రజా అన్నట్టు ఏపీలో అధికారుల తీరు

యధా రాజా తదా ప్రజా అన్నట్టు ఏపీలో అధికారుల తీరు


యధా రాజా తథా ప్రజా అన్నట్టు పాలకుల తరహాలోనే, ఎక్సైజ్ అధికారులు మామూళ్లతో అలవాటుపడి చూసీచూడనట్టు వదిలేయడంతో కల్తీ సారా తయారీ రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా జరిగిందని, కల్తీ సారా తాగి ఎన్నో కుటుంబాలు బాధిత కుటుంబాలకు మారాయని, ఎంతో మంది మృతి చెందారని దివ్యవాణి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సారా రహితంగా చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు రాష్ట్రంలో సారాను వరదలై పారిస్తుందని దివ్యవాణి పేర్కొన్నారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచినీళ్లు దొరకని ప్రాంతాలైన ఉంటాయి కానీ సారా దొరకని ప్రాంతం ఉండదని దివ్యవాణి విమర్శలు గుప్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+