వైసీపీలో రోజా ఒక ఐటమ్ సాంగ్ ..16 నెలలుగా జైల్లో జగ్గూ సీరియల్ : దివ్యవాణి ఘాటు వ్యాఖ్యలు
అచ్చెన్నాయుడు అరెస్ట్ పై రోజా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టిడిపి మహిళా నాయకురాలు దివ్యవాణి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక బీసీ నేతలు అరెస్ట్ చేశామని సైకో ఆనందం తప్ప,ఆయనను అరెస్టు చేయడానికి గల ఒక్క ఆధారమైన మీరు చూపించగలిగారా రోజా అని ప్రశ్నించారు దివ్యవాణి. ఇక రోజా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ చేశారని రోజా వ్యాఖ్యలు చేశారని, గతంలో జగన్ మోహన్ రెడ్డి కూడా తప్పు చేశారు కాబట్టే 16 నెలలపాటు జైల్లో ఉన్నారా అంటూ విమర్శలు గుప్పించారు దివ్యవాణి.

జైల్లో జగ్గూ సీరియల్.. ప్రతి శుక్రవారం చూడటం లేదా?
నెక్స్ట్ చంద్రబాబు అంటూ రోజా చేసిన విమర్శలపై టీడీపీ నాయకురాలు దివ్యవాణి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇక అచ్చెన్నాయుడు అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలు,రోజా వ్యాఖ్యలపై స్పందించిన దివ్యవాణి రోజా నువ్వు అడుగు పెట్టగానే సినిమాకి ఎండ్ కార్డ్ పడింది మర్చిపోయావా? అని ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రోజా అడుగుపెట్టగానే జగన్ కు తిప్పలు మొదలయ్యాయని ఆమె గుర్తు చేశారు. ‘‘జైల్లో జగ్గూ' అనే సీరియల్ 16 నెలలు సాగింది, ఇప్పటికీ ప్రతి శుక్రవారం వస్తుంది చూడటం లేదా? అంటూ ఎద్దేవా చేశారు .
Recommended Video

16ఏళ్ల పాటు జైలుకి రావాలి జగన్.. కావాలి జగన్ అనే పాట కంపోజింగ్‌లో ఉంది
వైయస్ జగన్మోహన్ రెడ్డి నేటికీ మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారంటూ దివ్యవాణి వ్యాఖ్యానించారు. ఇక అంతే కాదు 16ఏళ్ల పాటు జైలుకి రావాలి జగన్.. కావాలి జగన్ అనే పాట కంపోజింగ్‌లో ఉంది' అని కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు టీడీపీ నాయకురాలు దివ్యవాణి. ఇక ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి అవినీతి చిట్టా సీబీఐ బయట పెట్టిందని దివ్యవాణి వ్యాఖ్యానించారు. ఇక దీనిపై రోజు ఏం సమాధానం చెబుతుంది అంటూ ప్రశ్నించారు.

కూల్చివేతలు, కక్ష సాధింపు చర్యలు తప్ప ఏడాది పాలనలో ఏం చేశారు
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూల్చివేతలు, కక్ష సాధింపు చర్యలు తప్ప ఏడాది పాలనలో జగన్ ప్రభుత్వం సాధించిందేమీ లేదని దివ్యవాణి మండిపడ్డారు. వైసిపి పాలనలో ఇది సాధించాము అని చెప్పే ధైర్యం రోజాకు ఉందా అంటూ నిలదీశారు. వైసీపీలో రోజా ఒక ఐటమ్ సాంగ్ మాత్రమే అనే విషయాన్ని గుర్తిస్తే మంచిది అంటూ దివ్యవాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక బీసీ నేతను అరెస్ట్ చేసి ఆనంద పడడం తప్ప వైసీపీ నేతలు ఇంకా ఏం చేయగలరు అంటూ ఆమె ఫైర్ అయ్యారు.

ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని ఫైర్
టిడిపి మహిళా నాయకురాలు పంచుమర్తి అనురాధ కూడా జగన్ ప్రభుత్వం మీద మండిపడ్డారు. బీసీల మీద ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తోందని, అందుకే అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిందంటూ ఆమె ఫైర్ అయ్యారు. శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అచ్చెన్నాయుడును ఎదుర్కొనే దమ్ము లేక అరెస్ట్ చేసి గొంతు నొక్కి కుటిల ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు వైసిపి హయాంలో దారుణంగా పెరిగాయి అంటూ అనురాధ ఆరోపించారు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం లేక ఇంతకు తెగబడ్డారు అని ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని అనురాధ ఆరోపించారు. ఏ మచ్చలేని అచ్చెన్నాయుడు ను ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications