ఇదే చివరిది, సిద్ధంగా లేం: డికె అరుణ, కిరణ్‌కు సూచన
హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో ఇదే చిట్టచివరి రచ్చబండ అని సమాచార శాఖ మంత్రి డికె అరుణ ఆదివారం చెప్పారు. రాష్ట్ర విభజనకు అందరూ సహకరించాలని ఆమె కోరారు. భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ ప్రాంతంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా సీమాంధ్ర నేతలు అందరూ సహకరించాలన్నారు.
హైదరాబాదు తమకు దక్కకపోతే తెలంగాణ వాళ్లకు కూడా దక్కవద్దని చెప్పడం సరికాదన్నారు. సోమవారం నుండి 26వ తారీఖు వరకు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే చివరి రచ్చబండ కార్యక్రమం అని ఆమె వ్యాఖ్యానించారు.

హైదరాబాదు పైన అనవసర రాద్దాంతం చేయవద్దని ఆమె అన్నారు. భద్రాచలంను వదులుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకున్నందున సీమాంధ్రకు చెందిన తమ పార్టీ నేతలు అంగీకరించాలని కోరారు.
రాముడు లేని తెలంగాణ అవసరం లేదు: పొంగులేటి
రాముడు లేని తెలంగాణ తమకు అవసరం లేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన మండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి వేరుగా చెప్పారు. భద్రాచాలం తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగమేనని చెప్పారు. తాము ఒక ఇంచును కూడా సీమాంధ్రకు వదులకునే ప్రసక్తి లేదన్నారు. హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతం చేయడమంటే హైదరాబాద్ ప్రజలను అవమానించడమేనని మరో నేత నిరంజన్ అన్నారు.












Click it and Unblock the Notifications