ఆపేందుకు ఇంకా కుట్రలు: విభజనపై డికె అరుణ

హైద్రాబాద్ తెలంగాణలో అంతర్భాగమని అరుణ చెప్పారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలని సీమాంద్రులు భావించడం సరికాదని, హైద్రాబాద్‌ని యూటీ చేయడం వల్ల సీమాంద్రులకు ఒరిగేదేమీ లేదన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని జీవోఎంను కోరినట్లు తెలిపారు.
రాష్ట్ర విభజన ఖాయమని తేలడంతో చేసేది లేక సీమాంధ్రులు జిల్లాల హద్దుల విషయంలో సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని, నక్సలిజం పెరుగుతుందని, తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని జీవోఎంతో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ - ఇది రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చెబుతున్న సాకు మాత్రమేనని, శాంతిభద్రతల సమస్య ఏ రాష్ట్రానిది ఆ రాష్ట్రం చూసుకుంటుందన్నారు.
కొత్తగా ఏర్పడే రాష్ట్ర యంత్రాంగం ఆ సమస్యలపై దృష్టిసారిస్తుందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కొత్త రాష్ట్రానికి సీఎం రేసులో ఉన్నారాఅని ప్రశ్నించగా చిరునవ్వుతో సమాధానం దాటవేశారు.












Click it and Unblock the Notifications