కిరణ్ అధిష్టానాన్ని ఫుట్‌బాల్ ఆడుతున్నారు: డిఎల్

కిరణ్ కుమార్ రెడ్డి సైకో అని, సైకో ఫ్యాన్సీగా వ్యవహరిస్తూ ఉంటాడని ఘాటుగా విమర్శించారు. కిరణ్ రెడ్డి కొత్తపార్టీ పెట్టడని, కిరణ్ కుమార్ రెడ్డికి అంత ధైర్యం లేదని డిఎల్ అన్నారు. అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌కు డిపాజిట్లు రావన్న కొంతమంది చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అంత తీసి పారేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. సిఎం చర్యలతో మనస్తాపానికి గురైన శ్రీధర్‌బాబును కలసి పలకరిద్దామంటే కుదరలేదన్నారు.
మాజీమంత్రి శంకర్‌రావు, తాను బాధితులం కదా, అలాగే ఇప్పుడు శ్రీధర్‌బాబు కూడా చేరారని తెలిపారు. లండన్‌కు చెందిన ఓ మద్యం కంపెనీ ధరలు పెంచుకునేందుకు సిఎం కిరణ్ కుమార్ రెడ్డి యత్నిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications