అనుకున్నదే చేయండి: నారా రోహిత్, దెబ్బతిన్నదని ఆవేదన
విశాఖపట్నం: మీరు ఏమనుకుంటున్నారో.. ఏం కావాలనుకుంటున్నారో అదే చేయాలని, అలా చేయడం వల్ల మీరు అనుకున్న దాని కోసం నిజాయితీగా కృషి చేస్తారని ప్రముఖ తెలుగు హీరో నారా రోహిత్ విద్యార్థులకు సూచించారు. గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎక్స్‌లెన్స్ మీట్ (జెమ్)కు శనివారం ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులను ఆట, పాట, మాటలతో ఆకట్టుకున్నారు.
తాను గతంలో చూసిన అందమైన గీతం ఇది కాదని, తుఫాన్ కారణంగా బాగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి విశాఖను మళ్లీ గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. గీతం విశ్వవిద్యాలయంతో నారా రోహిత్ తన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. అనంతరం పలు పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
అంతర్ కళాశాలల అథ్లెటిక్ టోర్నీ ప్రారంభం

అంధ్ర విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల, మహిళల అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఏయూ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జీఎస్‌ఎన్ రాజు ముఖ్య అతిథిగా హాజరై బెలూన్లను గాలిలో ఎగురవేసి పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడాకారులు క్రమశిక్షణతో ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుతారని పేర్కొన్నారు. ఇటువంటి పోటీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం/స్పోర్టు బోర్డు, కళాశాల యాజమాన్య ప్రతినిధులను అభినందించారు.












Click it and Unblock the Notifications