వైద్యులు, నర్సుల ధర్నా: చిన్నారి మృతి (పిక్చర్స్)

హైదరాబాద్‌: తెలంగాణ ఆరోగ్య మంత్రి రాజయ్య అనుచరులమంటూ తమపై దాడి చేయడాన్ని, తమను దూషించడాన్ని నిరసిస్తూ సికింద్రాబాదులోని వైద్యులు, నర్సులు మంగళవారం తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో రోగులకు వైద్య సేవలు సరిగా అందలేదు.

వైద్య సేవలు అందకు మంగళవారంనాడు ఓ చిన్నారి మరణించినట్లు ఆరోపిస్తున్నారు. దీంతో చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని సోమవారంనాడు ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. అతనికి వైద్యులు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ దాదాపు 30 మంది వైద్యులపై దాడికి ప్రయత్నించారు.

తాము కొడితే పడాలని వారు హెచ్చరించారు. దాంతో వైద్యులు, జూనియర్ డాక్టర్లు సోమవారంనుంచి ఆందోళనకు దిగారు.

రోగుల ఇక్కట్లు

రోగుల ఇక్కట్లు

గాంధీ ఆస్పత్రిలో వైద్యుల ఆందోళనతో మంగళవారంనాడు రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వారికి సరైన వైద్యం అందలేదు.

ఆందోళనకు దిగిన రోగుల బంధువులు

ఆందోళనకు దిగిన రోగుల బంధువులు

వైద్యం అందక ఓ చిన్నారి గాంధీ ఆస్పత్రిలో మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రోగుల బంధువులు ఆందోళనకు దిగారు.

రోగుల ఎదురుచూపులు..

రోగుల ఎదురుచూపులు..

డాక్టర్లు, నర్సులు ఆందోళనలో ఉండడంతో రోగుల బంధువులు గాంధీ ఆస్పత్రిలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

గాంధీ ఆస్పత్రి వద్ద..

గాంధీ ఆస్పత్రి వద్ద..

గాంధీ ఆస్పత్రి వద్ద రోగుల బంధువులు తీవ్రమైన ఆందోళన చెందారు. రోగులు వైద్యం అందక ఇబ్బంది పడ్డారు.

చిన్నారి మృతి

చిన్నారి మృతి

వైద్యుల ఆందోళనతో చికిత్స అందక రోగులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. ఓ చిన్నారి చికిత్స అందకనే చిన్నారి మృతి చెందినట్లు ఆరోపణలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+