వైసీపీకి బీజేపీ చేస్తున్న తాజా మేలు ఇదే..! సర్వేల ఎఫెక్టేనా?

ఏపీలో వైసీపీని ఎలాగైనా గద్దె దింపాలనే లక్ష్యంతో కలిసి పనిచేస్తున్న టీడీపీ-జనసేన ద్వయం బీజేపీ కూడా తమతో కలిసివస్తే ఎన్నికల్ని క్లీన్ స్వీప్ చేయొచ్చనే ఆశతో ఉన్నాయి. అయితే ఈ మేరకు బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి పెట్టడంలో సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత తంతు మాత్రం ముగించడంలో విఫలమవుతున్నారు. దీంతో బీజేపీ అధిష్టానం తాజాగా చంద్రబాబుతో పాటు జగన్ ను సైతం పిలిపించి మాట్లాడింది. ఆ తర్వాత లెక్కలు మారినట్లు కనిపిస్తున్నాయి.

చంద్రబాబును ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా.. వాస్తవ పరిస్దితులపై ఆరా తీశారు. అలాగే టీడీపీ, జనసేన మనసులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. చివరికి సర్వే రిపోర్టుల్ని సైతం చంద్రబాబు ముందు పెట్టి మాట్లాడినట్లు తెలుస్తోంది. అనంతరం సీఎం జగన్ ను ప్రధాని మోడీ పిలిపించుకుని మాట్లాడారు. చంద్రబాబుతో మాట్లాడిన అమిత్ షా, జేపీ నడ్డా తిరిగి జగన్ ను పిలిపించుకుని మాట్లాడితే బావుండదని భావించి మోడీతో జగన్ కు సమావేశం ఏర్పాటు చేయించారు.

does bjp favour YS Jagan by delaying the tie-up and seat sharing with tdp-janasena duo?

అయితే పొత్తుల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతానికి మెజారిటీ సర్వేలు వైసీపీకే జై కొడుతున్నాయి. తాజాగా వెలువడిన ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే మినహాయిస్తే మిగిలిన సర్వేలన్నీ వైసీపీ తిరిగి గెలవడం ఖాయమని తేల్చేశాయి. దీంతో పాటు కేంద్ర నిఘా నివేదికలు ఎలాగో ఉన్నాయి. వీటన్నింటినీ పరిశీలించిన బీజేపీ పెద్దలు ఇప్పటికిప్పుడు టీడీపీ జనసేనతో పొత్తుపై ప్రకటన చేయరాదని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీతో సీట్ల పంపకాలపై టీడీపీ, జనసేన ఇద్దరూ మాట్లాడే పరిస్దితి లేదు. అలాగని ఆలస్యం చేస్తే కచ్చితంగా వైసీపీకి మేలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+