AP Election: ఏపీలో హింసకు అసలు కారణాలివే..! కౌంటింగ్ లో తేడా వస్తే ఇక...!

ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజు మొదలైన హింసాత్మక ఘటనలు రెండు రోజుల తర్వాత కూడా కొనసాగాయి. అయితే ఈసీతో పాటు హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించడంతో అధికారులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. అయినా ఇప్పటికీ పలు చోట్ల పరిస్ధితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇవన్నీ తిరిగి కౌంటింగ్ నాటికి పుంజుకోవడం ఖాయమన్న హెచ్చరికలు ఇప్పుడు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

అయితే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున చెలరేగిన హింస వెనుక అసలు కారణాల్ని అన్వేషిస్తే రెండు అంశాలు స్పష్టమవుతున్నాయి. ఇందులో ప్రధానమైనది భారీ ఎత్తున జరిగి పోలింగ్, రెండవది ఫలితాలపై వెలువడిన అంచనాలు. ఈ రెండు కారణాలే రాజకీయ పార్టీల నేతల్ని హింసకు పురికొల్పినట్లు ఈ ఘటనలపై జరుగుతున్న దర్యాప్తును గమనిస్తే అర్దమవుతోంది. ముఖ్యంగా ఈసారి గెలవడం లేదన్న ఆక్రోశంతోనే ఎక్కువగా నేతలు దాడులకు దిగినట్లు తెలుస్తోంది.

does high voter turnout and predictions causes violence in ap

ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఎక్కడా లేనంతగా ఏకంగా 81.86 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే 2 శాతం ఎక్కువగా జరిగిన పోలింగ్ కచ్చితంగా అధికార పార్టీని ముంచబోతోందన్న అంచనాలకు ఇది కారణమైంది. దీంతో అధికార పార్టీ వైసీపీ నేతలు పలు చోట్ల దాడులకు ప్రయత్నించారు. అదే సమయంలో పోలింగ్ సరళని గమనించిన వారు కూడా కూటమికే అధికారం దక్కేలా ఉందంటూ చేసిన విశ్లేషణలు కూడా వీరిలో ఆందోళన రేపాయి.

ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో గత ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం సాధించిన అధికార వైసీపీకి ఈసారి పలు చోట్ల ఎదురుగాలి వీచిందని పోలింగ్ సరళి చెబుతోంది. దీంతో పోలింగ్ రోజు మొదలైన ఈ దాడులు రెండు రోజుల పాటు కొనసాగాయి. వీటిని అదుపు చేసేందుకు అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్టులు చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో గెలుపుపై అటు అధికార పార్టీ, ఇటు విపక్షాలు పూర్తి ధీమాగా ఉన్నాయి. దీంతో కిందిస్ధాయిలో నేతలు, కార్యకర్తల్లోనూ అదే ధీమా కనిపిస్తోంది. ఇందులో ఎక్కడైనా తేడా కనిపిస్తే చాలు దాడులు చేసుకునే వరకూ పరిస్ధితులు వెళ్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+