ఆంధ్రజ్యోతికి జగన్ ఝలక్: 'మా కార్యక్రమాలకు మీరు రావొద్దు'..

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ రాజకీయాల్లో మీడియా పోషించే పాత్ర అంతా ఇంతా కాదు. ప్రత్యర్థులను కట్టడి చేయడానికి.. తమ చర్యలను ఘనంగా చాటుకోవడానికి అటు అధికార పక్షానికి, ఇటు ప్రతిపక్షానికి వంత పాడే మీడియా సంస్థలు ఉన్నాయి. అధికారంలో ఉన్న కారణంగానేమో ఈ విషయంలో టీడీపీ మీడియా మేనేజ్ మెంట్‌దే పైచేయి కావడం చాలాసార్లు గమనిస్తూనే ఉంటాం.

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్: తప్పులో కాలేసిన జగన్, తప్పు చేస్తున్నారా?

ఎల్లో మీడియా అని ముద్ర వేసుకునేంతలా.. టీడీపీకి భజన చేసే మీడియా తయారైందనేది అందరికీ తెలిసిన వాస్తవం. అందులో ఆంధ్రజ్యోతి వంటి పత్రికల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా మోడీ-జగన్ భేటీ అంశాన్ని ఆ పత్రిక వక్రీకరించిన తీరును ప్రతిపక్షం ఎండగడుతూనే ఉంది. ఆంధ్రజ్యోతి పత్రికను మేం బహిష్కరిస్తున్నాం అని ఆ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి బహిరంగంగానే ప్రకటించేశారు.

don't come to our meetings, jagan says with abn andhrajyothy media

అటు చంద్రబాబు సైతం గతంలో సాక్షిని చదవద్దంటూ పలుమార్లు మీడియా ముఖంగానే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇలా..ఈ ఇరు వర్గాల మధ్య మీడియా యుద్దం జరుగుతూనే ఉంది. తాజాగా జీఎస్టీ కోసం జరిగిన అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత.. హాలు నుంచి బయటకొచ్చిన జగన్.. తనకు ఎదురైన మీడియా ప్రతినిధులందరికి షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరించారట.

అదే సమయంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రతినిధులు కూడా అక్కడ తారసపడగా.. ముందుగా వారికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయిన జగన్.. ఆ తర్వాత ఆగిపోయారట. ఇక మీరు మా కార్యక్రమాలకు రావద్దంటూ విసురుగా అక్కడినుంచి వెళ్లిపోయారట. మొత్తానికి టీడీపీ-వైసీపీ మధ్య మీడియా యుద్దం మళ్లీ ముదురుతున్నట్లుగానే కనిపిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In Andhrapradesh politics Tdp-Ysrcp always targets each other with their media. Recently both parties are banning opponent media for their programs
Please Wait while comments are loading...