అందుకే బిజెపి రాయలసీమ డిక్లరేషన్, నేను రాయలసీమ బిడ్డనే: బాబు
Recommended Video

అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని పార్టీ నేతలకు టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు దిశానిర్ధేశం చేశారు.రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్న తరుణంలో రాయలసీమ డిక్లరేషన్‌ను బిజెపి ముందుకు తేవడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని కొందరు పార్టీ నేతలు చంద్రబాబునాయుడు దృష్టికి తెచ్చారు. తాను కూడ రాయలసీమ బిడ్డేనని చంద్రబాబునాయుడు పార్టీ నేతల దృష్టికి తెచ్చారు.
ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో శనివారం నాడు టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం నేపథ్యంలో కేంద్రంపై పోరాటం చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు చెప్పారు.
రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే ఎజెండాగా పనిచేయాలని పార్టీ నేతలకు చంద్రబాబునాయుడు సూచించారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై పార్టీ నేతలకు చంద్రబాబునాయుడు దిశా నిర్ధేశం చేశారు.

బిజెపి నేతలపై వ్యక్తిగత విమర్శలొద్దు
బిజెపి నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయకూడదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. బిజెపి నేతలు టిడిపిపై విమర్శలు చేసిన సమయంలో వారికి ధీటుగా సమాధానం చెప్పాలని బాబు పార్టీ నేతలకు సూచించారు. కానీ, బిజెపి నేతలకు సమాధానం చెప్పే పేరుతో వ్యక్తిగత విమర్శలకు పాల్పడకూడదని బాబు పార్టీ నేతలకు సూచించారు.

బిజెపి రాయలసీమ డిక్లరేషన్‌పై చర్చ
ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రజలంతా ఆందోళన చేస్తున్న సమయంలో బిజెపి రాయలసీమ నేతలు రాయలసీమ డిక్లరేషన్‌ను ముందుకు తీసుకు రావడాన్ని పార్టీ నేతలు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకే బిజెపి రాయలసీమ డిక్లరేషన్‌ను తెరమీదికి తెచ్చిందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. తాను కూడ రాయలసీమ బిడ్డేనని బాబు గుర్తు చేశారు. విమర్శలు చేసేవారు తాను కూడ రాయలసీమవాసినేనని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబునాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.బిజెపి నాటకాలు ఆడుతోందని పలువురు నేతలు బాబు దృష్టికి తెచ్చారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేదు
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకూదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్రంపై పోరాటం తప్పలేదు
ఏపీకి దక్కాల్సిన వాటాల విషయంలో కేంద్రంపై పోరాటం చేయాల్సిన అవసరం అనివార్యంగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో చెప్పారు. ఏపీకి ఇస్తానన్న హమీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో కేంద్రంపై పోరాటం చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు బాబు.












Click it and Unblock the Notifications