అయిదేళ్ల లోపు పిల్లలతో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులకు టీటీడీ గుడ్ న్యూస్: 21న ప్రత్యేక ఏర్పాట్లు

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 66,389 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 24,956 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.81 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 27 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేాశారు.

Don t Miss the Pulse Polio Immunisation in Tirumala on December 21

కాగా.. ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్త కార్యక్రమంలో జరుగనుంది. ఇందులో భాగంగా చిన్నారుల తల్లిదండ్రుల సౌకర్యం కోసం తిరుమలలో పలుచోట్ల పల్స్ పోలియో కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది. అయిదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని డిసెంబర్ 21న ఉదయం 7 గంటలకు ప్రారంభమౌతుంది. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్.. దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, జీఎన్సీ టోల్ గేట్, సీఆర్ఓ, పీఏసీ 1, పీఏసీ 2, కొత్త బస్టాండ్, హెల్త్ ఆఫీస్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, వైకుంఠం క్యూకాంప్లెక్స్ 2, ఏటీసీ, ఎంబీసీ-34, వరాహస్వామి విశ్రాంతి గృహం 1, రాంభగీచా రెస్ట్ హౌస్ 1, కల్యాణకట్ట, మేదరమిట్ట, పాపవినాశనం, సుపథం, బాలాజీ నగర్ వినాయక ఆలయం, బాలాజీ నగర్ బాలబడి, ఎస్వీ హై స్కూల్, తిరుమల ఆలయం లోపల- వెలుపల, ఉద్యోగుల డిస్పెన్సరీల వద్ద పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు.

చిన్నారులకు సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారు. ఇందులో భాగంగా 20వ తేది ఉదయం 10 గంటలకు ఎస్వీ హైస్కూల్ నుంచి బాలాజీ నగర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తులు, స్థానికుల కోసం జీపులో ప్రకటనలు చేస్తూ అవగాహన కలిగించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+