జగన్ మీకిది తగునా.. రైతులకు వేధింపులు, చంద్రబాబు ఫైర్

ఏపీ సర్కార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. జగన్ సర్కార్ మితిమిరి ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. వారు చేసే తప్పులను జనం చూస్తున్నారని వివరించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు పెరిగి పోతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. విజయనగరం లచ్చయ్య పేటలో చెరకు బకాయిలు చెల్లించాలని నిరసన తెలుపుతున్న రైతులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. అన్నపూర్ణగా పేరొందిన రాష్ట్రంలో అన్నదాతలపై అక్రమ కేసులు సిగ్గుచేటని దుయ్యబట్టారు. అన్యాయానికి గురైన రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే నియంతలా వ్యవహరించటం సరికాదని తప్పుబట్టారు. అన్నదాతలు అంత అలుసు అయ్యారా అని అడిగారు.

పొలంలో వ్యవసాయం చేస్తూ సమాజ సేవ చేసే రైతులను సీఎం జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. పైగా తమ సమస్యల కోసం నిరసన తెలిపిన రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. రైతులంటే సీఎం జగన్ చులకన భావంతో చూస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రం అందరూ అవసరం అవుతారు.. కాళ్ల వేళ పడతారని చెప్పారు.

donot harass farmers, chandrababu ask cm jagan

అమరావతి రైతులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపారని, ఇప్పుడు చెరకు ‎రైతులపై కేసులు పెట్టారని మండిపడ్డారు. అక్రమ కేసులు వెంటనే ఎత్తివేసి, వారికి తక్షణమే బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రైతులు అంటే ఎందుకు చిన్నచూపు అని అడిగారు. వారిని మనుషులుగా చూడకపోవడం దారుణం అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం హక్కు అని ఆయన వివరించారు. దానిని కూడా ఉల్లంఘించడం మంచి పద్ధతి కాదన్నారు.

Recommended Video

    ఏపిలో అరాచకం రాజ్యమేలుతుందన్న టీడిపి జాతీయ అధికార ప్రతినిధి దివ్యవాణి || Oneindia Telugu

    ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, మేధావులే కాదు.. రైతులు, ఇతర వర్గాలు కూడా ఆందోళన చేపడుతాయని చంద్రబాబు నాయుడు తెలియజేశారు. దానికి అలా చేయడం సరికాదని వివరించారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. జనం అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ఇకనైనా బుద్దిగా ఉండాలని.. లేదంటే ఎన్నికల సమయంలో తగిన బుద్ది చెబుతారని తెలియజేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+