మత్తు కోసం చోరీలు: విశాఖలో యాచకురాలిపై రేప్ చేసిన శివ జీవన శైలి

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్టణం: చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో పాటు అల్లరి చిల్లరిగా తిరగడం గంజి శివకు అలవాటైంది. ఎక్కడికెళ్లావనే విషయమై తల్లి ప్రశ్నిస్తే
ఆమెను కూడ చితకబాదేవాడు శివ. మత్తు మందులకు అలవాటుపడడంతో ఇంటికి రావడమే మానేశాడు. ఇంటికి వస్తే తల్లిని కొట్టకుండా తిరిగి వెళ్ళేవాడు కాదు. ఇటీవల కాలంలో ఇంటికి రావడమే తగ్గించేశాడు. మతిస్థిమితం కోల్పోయిన యాచకురాలిపై శివ రెండు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడు.

నిత్యం రద్దీగా వుండే రైల్వేస్టేషన్‌ సమీపంలో ఫుట్‌పాత్‌పై శివ... యాచకురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారాయి..

Drunk man attempts to rape woman on footpath in broad daylight in Vizag, no passerby comes to rescue

చిన్నతనం నుంచి తండ్రి లేకపోవడంతో శివ జులాయిగా తయారయ్యాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మత్తుమందులకు అలవాటు పడడంతో విచక్షణ కోల్పోయి అనేక నేరాలకు పాల్పడ్డారంటున్నారు.

శివ రైల్వే న్యూలనీ పరదేశమ్మగుడి పరిసర ప్రాంతాల్లో చిన్న గదిలో తన తల్లి మణెమ్మతో కలిసి వుంటున్నాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం, చెప్పే వాళ్లు లేకపోవడంతో అల్లరిచిల్లరిగా తిరిగేవాడు.

గంజాయి, మత్తు కలిగించే మందుల వాడకానికి అలవాటు పడడంతో విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో తల్లిని కూడా తరచూ కొడుతుంటాడని పోలీసులు చెప్పారు.. నచ్చినప్పుడు ఇంటికి వస్తాడు.ఎందుకు వచ్చావని అడిగినా, ఎక్కడకు వెళుతున్నావని అడిగినా తల్లిని చావగొట్టేవాడు. దీంతో తల్లి కూడా శివను పట్టించుకోవడం మానేసింది.

ఇళ్లలో పాచిపనులు చేస్తూ వచ్చే మొత్తంతో గదికి అద్దె కట్టుకుని మిగిలిన మొత్తంతో జీవనం సాగిస్తోంది. శివ మాత్రం తన వ్యసనాలకు డబ్బుల్లేకపోతే తన స్నేహితుడైన పిడుగు మణికంఠతో కలిసి ఇళ్లలో చోరీలు చేయడం, దారిన వెళ్లేవారిపై దాడి చేసి డబ్బులు, ఆభరణాలు లాక్కోవడం చేస్తుంటాడు.

వీటిపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు పలుమార్లు శివను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఎప్పటిలాగే ప్రవర్తిస్తుండేవాడు. దీంతో నాలుగో పట్టణ పోలీసులు శివపై సస్పెక్ట్‌ షీట్‌ ఓపెన్‌ చేశారు. ఆదివారం రోడ్డుపక్కన ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న యాచకురాలిపై అత్యాచారం చేయడంతో శివను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a shocking incident reported from Vizag in Andhra Pradesh, a drunk man allgedly attempted to rape a woman on a footpath in broad daylight as passers-by refused to pay heed to woman’s desperate calls for help.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి