తోటకు ద్వంద్వ సభ్యత్వం: పొంగులేటి, సవతి ప్రేమన్న గీత
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఖమ్మంలోని ఏడు మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన సభ్యుడికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా సభ్యత్వం కల్పించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.
గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడుతూ.. ఏడు మండలాల్లోని 211 గ్రామాల్లో నివసిస్తున్న 34 వేల కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని తెలిపారు. వారి గురించి ఏ ప్రభుత్వమూ పట్టించుకోవటం లేదన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణకు ఎన్నికైన శాసనసభ్యుడు ఈ ఏడు మండలాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించటం లేదని చెప్పారు. శాసనసభ్యుడు తోట వెంకటేశ్వరరావు వీరులపాడుకు చెందినవాడని, దీంతో ఆయన తన బాధ్యతలను నిర్వహించలేకపోతున్నారని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే తోట వెంకటేశ్వరరావుకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ద్వంద్వ సభ్యత్వం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
సీమాంధ్రులపై సవితి ప్రేమ: గీత
ఆంధ్రప్రదేశ్‌కు వీలైనంత త్వరగా సొంత హైకోర్టును ఏర్పాటు చేయాలని ఎంపి కొత్తపల్లి గీత విజప్తి చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలోని సీమాంధ్రుల పట్ల స్థానిక ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు.
రాష్ట్ర విభజన అస్తవ్యస్తంగా జరిగిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త హైకోర్టు ఏర్పడేంత వరకు హైదరాబాదులోని హైకోర్టు రెండు రాష్ట్రాల కోర్టుగా వ్యవహరించాలి కానీ తెలంగాణ ప్రభుత్వం తీరు మూలంగా ఇది సాధ్యం కావటం లేదని తెలిపారు.












Click it and Unblock the Notifications