చాలు, సినిమాల్లోకెళ్లు: చిరుకు గాలి, ఎన్టీఆర్‌కి బాబులా ఎవరు ద్రోహం చేయలేదు: విహెచ్
రాజమండ్రి: చిరంజీవి రాజకీయాలు మానుకొని సినిమాల్లోకి తిరిగి వస్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు బుధవారం మండిపడ్డారు. వైసిపి, కాంగ్రెస్ పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. జగన్‌కు సిఎం కుర్చీపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదన్నారు.
క్రెడిట్ మొత్తం తనకే దక్కాలన్న చంద్రబాబు దురాశవల్లే: విహెచ్
గోదావరి పుష్కరాలు 2015 క్రెడిట్ అంతా తనకే దక్కాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దురాశకు పోయాడని, అందువల్లే మంగళవారం నాటి దుర్ఘటన జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు అన్నారు.

ఎవరు ఎన్ని బొమ్మలు పెట్టినా గతంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌కు చేసిన ద్రోహం ఇప్పటి వరకు ఎవరు చేయలేదన్నారు. చంద్రబాబు గోదావరి తీరాన శ్రీకృష్ణ వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంపై విహెచ్ పైవిధంగా స్పందించారు.
పుష్కరాల నేపథ్యంలో ఏ శాఖ బాధ్యత ఆ శాఖకు అప్పగిస్తే బాగుండేదన్నారు. కానీ చంద్రబాబు క్రెడిట్ అంతా తనకే దక్కాలనుకున్నారన్నారు. రాజమండ్రి మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు, గాయపడ్డ వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విహెచ్ రాజమండ్రిలో విఐపి పుష్కర ఘాట్లో పుణ్యస్నానమాచరించారు.
వివాదాస్పదం చేయొద్దు: సునీత
రాజమండ్రి తొక్కిసలాట ఘటనను వివాదం చేయడం తగదని మంత్రి పరిటాల సునీత అన్నారు. చంద్రబాబును నమ్మి అనంతపురం జిల్లా రైతాంగం రూ.3600 కోట్లు నష్టపోయిందని మాజీ ఎంపి అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. ప్రభుత్వా వారి నష్టాన్ని భరించాలని లేకుంటే కోర్టుకు వెళ్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications