Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది..
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలొస్తున్నారుణ. వెంకటేశ్వర స్వామి దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లన్నీ నిండిపోయాయి. నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. భక్తులకు నీరు, ఆహారం అందిస్తోంది. స్వామివారిని శుక్రవారం 72,294 మంది భక్తులు దర్శించుకున్నారు.
ఇందులో 31 వేలకు పైగా భక్తలు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.39 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు స్వామివారు మోహినీ అలంకారంలో దర్శమిచ్చారు.

మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. అనంతరం ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు.
రాత్రి 7.30 గంటల నుండి విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో రమేష్, కంకణ భట్టర్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు. రుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్టాభిషేకం శుక్రవారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పునర్దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications