విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముగిసిన బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు-పూర్ణాహుతి పూర్తి

|
Google Oneindia TeluguNews

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన దసరా శరన్నవరాత్రులు ఇవాళ ముగిశాయి. చివర్లో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన వేద పండితులు శరన్నవరాత్రులకు ముగింపు పలికారు.య ఈ సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు దేవస్ధానం పాలకమండలి సభ్యులు కూడా పాల్గొన్నారు.

బెజవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా సాగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ అంతే వైభవంగా ముగిశాయి. పూర్ణాహుతి తో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. పూర్ణాహుతి లో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో బ్రమరాంబతో పాటు పలువురు వేడ పండితులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను ఘనంగా‌ నిర్వహించామని ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ మోహన్ ప్రకటించారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేసిన అందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

దసరా శరన్నవరాత్రులు ముగియడంతో విజయదశమి రోజు సాయంత్రం నిర్వహించే నిర్వహించే తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాల్లో లక్షల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవస్ధానం ఈవో భ్రమరాంబ తెలిపారు. కృష్ణానదిలో వరద ప్రవాహం వలన సాయంత్రం దుర్గమ్మ నదీ విహారం లేదని ఆమె వెల్లడించారు. హంసవాహనంపై ఆది దంపతులకు పూజాది కార్యక్రమాలు మాత్రం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేపు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని ఆమె వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు భవానీల రద్దీ కొనసాగే అవకాశం ఉందన్నారు. సాయంత్రం తెప్పోత్సవంకు భవానీల రద్దీ ఉండడంతో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు.

dussehra sarannavaratris concluded with purnahuti in vijayawada kanakadurga temple

Recommended Video

Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ మూలా నక్షత్రం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిన్న అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరితో పాటు పలువురు వీఐపీలు, అధికారులు, సినీ నటీనటులు, సెలబ్రిటీలు సైతం ఈసారి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

English summary
dussehra sarannavaratris in vijayawada kanakadurga temple have been concluded today with purnahuti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X