ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాల షెడ్యూల్ ఇలా..!!

విజయవాడ ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3 తేది నుండి 12 తేది వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల నిర్వహణ పైన ఆలయ అధికారులు ప్రకటన చేసారు. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. తొలిరోజు అక్టోబర్ 3న శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. చివరి రోజైన అక్టోబర్ 12 న అమ్మవారు రాజరాజేశ్వరి దేవీగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

శరన్నవరాత్రులు
తొమ్మది రోజుల పాటు ఇంద్రకీలాద్రి పైన శరన్నవరాత్రుల ఉత్సవాలను ఆలయ అధికారులు వెల్లడించారు. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజల అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. నవరాత్రుల్లో తొలి రోజు అయిన అక్టోబర్ 3 తేది న బాలా త్రిపుర సుందరీదేవిగాగా అమ్మవారు దర్శనమిస్తారు. 4వ తేది న గాయత్రీదేవిగా, 5వతేది న అన్నపూర్ణ దేవిగా, 6న లలితా త్రిపుర సుందరీదేవిగా, 7 న మహాచండీ గా, 8 న మహాలక్ష్మీ దేవి గా , 9 న సరస్వతి దేవిగా, 10న దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Dussehra Sharannavaratri Celebrations at Indrakeeladri to begin from October 3

అమ్మవారి దర్శనం
10వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించనున్నారు. 0011తేది న మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిస్తారు. 12 తేది న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. శరన్నవరాత్రుల వేళ భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు. ఈ సారి దసరా ఉత్సవాలకు 9 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. పాలకవర్గం ఏర్పాటు కూడా పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది.

ప్రత్యేక ఏర్పాట్లు
నవరాత్రులు జరిగే తొమ్మిది రోజుల్లో మూలా నక్షత్రం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో, అంతరాలయం దర్శనం గతంలో నిలుపుదల చేసి సామాన్య భక్తులకు అవకాశం కల్పించారు. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా దేవాదాయ శాఖ సిబ్బందిని నియమించనున్నారు. తొమ్మిదిరోజులు పది అలంకారాల్లో దర్శనమివ్వబోతున్నారు దుర్గమ్మ. కొండచరియలు పడే మార్గంలో ఆరు అడుగుల రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+