దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్: భార్య, పిల్లలపై హైకోర్టును ఆశ్రయించిన దువ్వాడ!
దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ పంచాయతీ టీవీ సీరియల్ ల కంటే ఎక్కువ ట్విస్టులతో , రోజుకో కొత్త షాకింగ్ పరిణామాలతో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రంలో తన భర్తతోనే తాను ఉంటాను ..ఇంట్లోకి రానిస్తే చాలు అంటూ దువ్వాడ వాణి తాజాగా సంచలన ప్రకటన చేసి దివ్వల మాధురితో తనకు, తన భర్తకు, పిల్లలకు ప్రాణహాని ఉందని షాకింగ్ ఆరోపణలు చేశారు.
కోర్టు మెట్లెక్కిన దువ్వాడ
తనతో కాదు శ్రీనివాస్ కు తన భార్య వాణితోనే ప్రాణహాని ఉందని మాధురి రివర్స్ అటాక్ చేశారు. ఇదిలా నడుస్తూ ఉండగానే తన కుటుంబ పంచాయతీని కోర్టులో పెట్టారు దువ్వాడ. తన ఇంటి పైకి వచ్చి భార్య వాణి, కుమార్తె హైందవి వివాదం చేస్తున్నారని, వారిపై తాను ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారని, కానీ కేసులో పోలీసులు దర్యాప్తు చేయడం లేదని దువ్వాడ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు.

కోర్టులో దువ్వాడ పిటీషన్ పై వాదనలు
తాను ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకొని పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి వి ఎల్ ఎన్ చక్రవర్తి పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విని పోలీసులను పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. కోర్టులో ముందు పోలీసుల తరఫున ప్రభుత్వం న్యాయవాది కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు.
కోర్టులో పోలీసులు చెప్పిందిదే
ఐదు రోజుల క్రితమే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు నిందితులు వాణి, హైందవిలకు సెక్షన్ 41 ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచామని కూడా ఆయన తెలిపారు. మరోపక్క దువ్వాడ శ్రీనివాస్ పై ఆయన అర్థాంగి వాణి సైతం ఫిర్యాదు చేశారని, పూర్తి వివరాలు ఇవ్వడానికి సమయం కావాలంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఇంటి కోసం వాణి వర్సెస్ మాధురి
మొత్తానికి పతి పత్ని ఔర్ ఓ కహానీలో ఎవరికివారు తాము అనుకున్నది సాధించాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కొత్తగా కట్టిన ఇంట్లోనే తాము ఉండాలని, తన భర్తతో కలిసి ఉంటానని చెబుతున్న వాణి ఆ ఇంట్లోకి తనను అనుమతించాలని ఇంటి బయట కారుషెడ్ లో ఆందోళన చేస్తుంటే, ఆ ఇంటి మీద తనకు హక్కు ఉందని మాధురి వాదిస్తోంది.
భార్యతో కలిసి ఉండేందుకు నో అంటున్న దువ్వాడ
ఇక దువ్వాడ శ్రీనివాస్ తనను బజారుకీడ్చిన తర్వాత తిరిగి వాణితో తాను ఎలా ఉంటాను అంటూ భార్యను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు ఏదైనా కోర్టులోనే చూసుకుంటానని తేల్చి చెబుతున్నారు. మరి ఈ దువ్వాడ వారి ఫ్యామిలీ పంచాయతీలో ముందు ముందు ఏం జరగబోతుందో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications