దువ్వాడ వారి మాధురి.. ఊహించని షాకింగ్ నిర్ణయం

వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రంలో తాజాగా దివ్వెల మాధురి సంచలన వీడియో విడుదల చేశారు. నిన్నటి వరకు దువ్వాడ శ్రీనివాస్ అంటే తనకు ఇష్టమని, తనకు పిచ్చి అంటూ, తనకు దువ్వాడ శ్రీనివాస్ దేవుడులా కనిపిస్తాడు అంటూ షాక్ అయ్యేలా వ్యాఖ్యలు చేసిన దివ్వెల మాధురి దువ్వాడ కుటుంబ పంచాయతీ పుణ్యమా అంటూ తనకు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని రెట్టించిన సంతోషంతో ఉన్నారు.

సోషల్ మీడియాకు దూరంగా ఉంటానన్న మాధురి
మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ దువ్వాడ శ్రీనివాస్ పై రోజుకో పాట పాడుతూ సిగ్గులు వలకబోస్తూ రచ్చ చేశారు. ఇక తాజాగా ఏమైందో ఏమో గాని దివ్వెల మాధురి సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ చేశారు. తాను ఓ పది రోజులు పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానంటూ మాధురి చెప్పుకొచ్చారు. తన ఆరోగ్యం మళ్లీ దెబ్బతిందని, రీసెంట్ గా తనకు జరిగిన యాక్సిడెంట్ తో బ్లడ్ క్లాట్ అయినచోట మళ్లీ ఇబ్బంది పెడుతోందని అన్నారు.

Duvvada srinivas family drama Divvela Madhuri posted a sensational video

బ్లడ్ క్లాట్ ఎక్కువైంది.. డాక్టర్ల సూచన
డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని దివ్వెల మాధురి పేర్కొన్నారు. మీ అందరి సపోర్టుతో తనకు చాలా ధైర్యంగా ఉందని పేర్కొన్న దివ్వెల మాధురి మీ సపోర్టు ఎప్పటికీ ఇలా ఉండాలని, ఇదే సపోర్టుతో తాను ముందుకు వెళ్లాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. బ్లడ్ క్లాట్ మళ్లీ ఎక్కువైన కారణంగా డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని, మాట్లాడలేకపోతున్నానంటూ అందుకే కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా అన్నారు.

మళ్ళీ పది రోజుల తర్వాత లైవ్ లోకి వస్తా
మళ్ళి పది రోజుల తర్వాత లైవ్ లోకి వస్తాను. మీ అందరితో మాట్లాడతాను. నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థాంక్స్ అంటూ మాధురి సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టారు. దువ్వాడ ఫ్యామిలీపంచాయతీలో కారు యాక్సిడెంట్ తర్వాత తాను తీవ్రమైన డిప్రెషన్ కు లోనైనట్టు, దువ్వాడ వాణి తనపై చేసిన వ్యాఖ్యలతో ఆత్మహత్య చేసుకోవడానికి కారు ప్రమాదాన్ని చేసినట్టు చెప్పిన దివ్వెల మాధురి ఆ తరువాత పరిణామాలతో ఉత్సాహంగా కనిపించారు.

సోషల్ మీడియా వీడియోతో సంచలన ప్రకటన
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా తనను ఫాలో చేసేవారు బాగా పెరిగిపోయారని, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా తనకు మద్దతు లభిస్తుందని పేర్కొన్నదివ్వెల మాధురి లైఫ్ లాంగ్ దువ్వాడ శ్రీనివాస్ తోనే ఉంటానని తేల్చి చెప్పారు. ఇక తాజాగా డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు అంటూ వీడియో పోస్ట్ చేసి సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చినట్టుగా చెప్పారు దివ్వెల మాధురి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+