ముంబై–హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్.. ఆ జిల్లా నుండి కేంద్రానికి విజ్ఞప్తి!
తెలంగాణా రాష్ట్రంలో బుల్లెట్ రైలు కారిడార్ ల నిర్మాణానికి రూట్ లు, డీపీఆర్ లు తయారు చేసి ప్రతిపాదనలు పంపిన వేళ అప్పుడే బులెట్ రైల్ కారిడార్ లపై విజ్ఞప్తులు కనిపిస్తున్నాయి.
ముంబై హైదరాబాద్ మధ్య ప్రతిపాదిత బుల్లెట్ రాలు కారిడార్ మహారాష్ట్రలోని ముంబై, నాసిక్, అహ్మద్ నగర్ తో పాటు తెలంగాణాలోని నిజామాబాద్, సంగారెడ్డి,హైదరాబాద్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయని అంచనా.
బుల్లెట్ రైల్ కారిడార్ ప్రారంభం కాకముందే సంగారెడ్డి నుండి కేంద్రానికి విజ్ఞప్తి
ఈ క్రమంలో బుల్లెట్ రైల్ కారిడార్ ప్రారంభం కాకముందే సంగారెడ్డి నుండి విజ్ఞప్తి కేంద్రానికి చేరింది. సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ స్థానిక ప్రజా ప్రతినిధులు ఢిల్లీలో కేంద్రమంత్రితో సమావేశం అయ్యారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవి చంద్రలు కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి మాట్లాడారు.

సంగారెడ్డిలో స్టేషన్ ఏర్పాటు చేయాలని మంత్రికి విజ్ఞప్తి
ముంబై హైదరాబాద్ ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ కారిడార్ లో భాగంగా సంగారెడ్డిలో స్టేషన్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. జహీరాబాద్ లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ మరియు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అవసరాల కోసం బుల్లెట్ ట్రైన్ స్టాప్‌తో పాటు రైల్వే ర్యాక్ పాయింట్ మంజూరు చేయాలని కోరారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కాకముందే ఈ విజ్ఞప్తి రైల్వే మంత్రికి చేరింది.
రూ.1.10 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బుల్లెట్ రైల్ కారిడార్
ముంబై నుండి హైదరాబాద్ కు ప్రతిపాదిత హై స్పీడ్ రైలు కారిడార్ సుమారు 700 నుండి 750 కిలోమీటర్ల పొడవు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ముంబై హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం ఏడు ఎనిమిది గంటల నుండి మూడు గంటలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1.10 లక్షల కోట్ల రూపాయలు ఉండవచ్చని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలు సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications