ప్రధాని సమక్షంలో పవన్ ఎమోషనల్..!!

ప్రధాని మోదీ సమక్షంలో పవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కాశ్మీర్ లో ఉగ్రదాడుల అంశాన్ని ప్రస్తావించారు. గత అయిదేళ్లు కాలంలో అమరావతి రైతుల కష్టాలను గుర్తు చేసారు. కూటమి నేతలు హామీ ఇచ్చిన విధంగా అమరావతి తిరిగి నిలబడుతుందని చెప్పుకొచ్చారు. దేశానికే తల మానికంగా అమరావతి నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. కాశ్మీర్ లో ఉగ్రదాడుల అంశం ప్రస్తావన సమయంలో పవన్ ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి సమయంలో ప్రధాని అమరావతి కోసం రావటాన్ని అభినందించారు.

ప్రధాని సమక్షంలో
అమరావతి పనుల రీ లాంఛ్ సభ అట్టహాసంగా మొదలైంది. అమరావతికి వచ్చిన ప్రధానికి ఏపీ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. సభలో డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగం సమయంలో గత అయిదేళ్లు కాలంలో అమరావతి రైతులు చేసిన పోరాటం కారణంగానే రాజధాని నిలిచిందని చెప్పుకొచ్చారు. అమరావతి లో రైతులు ధర్మయుద్ధం గెలిచారున్నారు. గత అయిదేళ్ల కాలంలో రైతుల పై కేసులు పెట్టారని గుర్తు చేసారు. నాడు ఇచ్చిన హామీల మేరకు అమరావతి పున ప్రారంభం జరుగుతోందని వివరించారు. రైతుల త్యాగాలను మర్చిపోమని.. శక్తి మేర రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.

dy-cm-pawan-kalyan-emotional-speech-in-amaravati-re-launch-meeting

రైతుల కష్టం మర్చిపోం
గత ప్రభుత్వంలో వేధింపులకు గురయ్యారని చెప్పుకొచ్చారు. రాజధాని కోసం అమరావతి మహిళల పాత్ర అద్బుతమని. ఆంధ్ర పౌరుషం చూపించారని ప్రశంసించారు. గత అయిదేళ్ల కాలంలో రైతులను గత ప్రభుత్వం అవమాన పరిచిందన్నారు. అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వ శ్రేష్ఠ రాజధానిగా నిలుస్తుందని పవన్ పేర్కొన్నారు. జవాబుదారీ, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ఎన్డీఏ కేంద్రం, రాష్ట్రంలో ఉన్న కారణంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు దశల వారీగా అమలు చేస్తున్నామని పవన్ వివరించారు. మ్యాచింగ్ గ్రాంట్స్ కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయిందని.. ఇప్పుడు ఫెడరల్ స్పూర్తితో పని చేస్తున్నా మని పవన్ పేర్కొన్నారు.

మోదీకి మద్దతుగా
రాష్ట్రంలో రహదారులు.. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తున్నామని పవన్ వెల్ల డించారు. ఏపీ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైబరాబాద్ సిటీని రూపించారో.. అమరావతిని ఆయన అపార అనుభవంతో దక్షతతో అద్బుత నగరం గా దేశానికి తలమానికంగా తీర్చి దిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేసారు. కాశ్మీర్ లో సంక్లిష్ట సమయం లో.. యుద్ద వాతావరణం నెలకున్న వేళ.. వేదన ఉన్నా.. అమరావతి రైతుల త్యాగాలు మర్చి పోకుండా ప్రధాని రావటం పట్ల ధన్యవాదాలు వ్యక్తం చేసారు. పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తం బాధ పెట్టిందని.. ఇది సున్నిత సమయంగా పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో మోదీ అమరావతికి రావటం ద్వారా ఏపీ పట్ల తనకు ఉన్న అంకిత భావం ఏంటో స్పష్టం చేసారని పవన్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+