ఫ్రీ గ్యాస్ సిలిండర్ కావాలంటే - ఇవి తప్పనిసరి, తాజా మార్గదర్శకాలు..!!

ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించింది. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల ఈ పథకం ద్వారా అందించనున్నారు. అయితే, ఈ స్కీం అర్హత పైన లబ్దిదారుల్లో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కనెక్షన్ ఎవరి పేరుతో ఉన్నా పథకం అమలు అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డుల సంఖ్య కంటే పథకం అర్హుల సంఖ్య తక్కువగా ఉంది. ఇదే సమయంలో ఈ కేవైసీ విధానం సమస్యగా మారుతోంది.

ఇవి తప్పనిసరి
రాష్ట్రంలో మొత్తంగా 1.54 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 1.08 కోట్ల కనెక్షన్లు ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హత ఉన్నవి గా గుర్తించారు. గ్యాస్ కనెక్షన్ ఉన్న వారిలో ఆధార్, రేషన్ కార్డు అనుసంధానం తప్పని సరి చేసారు. అయితే, కొంత మంది ఆధార్ అనుసంధానం చేసుకోలేదని గుర్తించారు. వీరు తమ కనెక్షన్లతో అనుసంధానం చేసుకుంటే అర్హుల జాబితాలో చేరనున్నారు. ఇక, ఈ పథకం అమలు లో వస్తున్న అనేక సందేహాలకు అధికారులు సమాధానం ఇచ్చారు.

E KYC becomes mandatory for Free Gas Cylinders scheme guidelines issued

ఎవరి పేరుతో ఉన్నా
గ్యాస్ రాయితీ సిలిండర్లు పొందాలంటే ఎవరి పేరుతో కనెక్షన్ ఉన్నా, రేషన్‌ కార్డు, ఆధార్ కార్డు తప్పని సరిగా తేల్చారు. ఎవరి పేరుమీద గ్యాస్ కనెక్షన్‌ ఉందో ఆ వ్యక్తి పేరు రేషన్‌ కార్డులో ఉంటే రాయితీ వస్తుందని అధికారులు స్పష్టం చేసారు. కుటుంబ సభ్యుల పేర్లతో ఎన్ని కనెక్షన్లు ఉన్నా .. ఒక కనెక్షన్ కు మాత్రమే రాయితీ వర్తిస్తుంది. ఇదే సమయంలో ఈ పథకం అమలు కావాలంటే ఈ కేవైసీ తప్పని సరిగా పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇందు కోసం ఆన్‌లైన్‌లో లేదా డీలర్‌ వద్దకెళ్లి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఏవైనా సమస్యలు ఉంటే 1967 (టోల్‌ ఫ్రీ) నంబరుకు ఫోన్‌ చేయొచ్చని అధికారులు సూచించారు. అదే విధంగా గ్రామ/వార్డు సచివాలయాల్లో నూ సంప్రదించాలని పేర్కొంటున్నారు.

ఈ కేవైసీ కోసం
ప్రభుత్వం ఈ కేవైసీ తప్పనిసరి అని చెబుతుంటే..ఇక్కడే వినియోగదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ కేవైసీ కోసం లబ్దిదారులు పెద్ద ఎత్తున తమకు సంబంధించిన గ్యాస్ పంపిణీ దారుల వద్దకు క్యూ కడుతున్నారు. అక్కడ రద్దీ పెరిగి గంటల తరబడీ నిరీక్షించాల్సి వస్తోంది. గతంలో గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ సమయంలో ఈ కేవైసీ తీసుకోవాలనే ప్రతిపాదన పైన చర్చ జరిగింది. కానీ, అమలు కాలేదు. ఇప్పుడు ఈ రద్దీ నివారణకు ఆ విధానం అమలు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్రామ .. వార్డు సచివాలయ సిబ్బందితో ఈ కేవైసీ తీసుకునేలా చూడాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+