విజయవాడలో కాలేజీల వద్ద "ఆపరేషన్ సేఫ్ జోన్ క్యాంపస్"-ఏం దొరికాయంటే ?
ఏపీలో డ్రగ్స్ నియంత్రణ కోసం పనిచేస్తున్న ఈగల్ టీమ్ ఇవాళ విజయవాడలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పేరుతో తనిఖీలు చేపట్టింది. ముఖ్యంగా కాలేజీల్లో డ్రగ్ కల్చర్ పెరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. నగరంలోని పలు కాలేజీల సమీపంలో ఉన్న షాపుల్లో ఈగల్ టీమ్ ఛీఫ్ ఆకే రవికృష్ణతో పాటు విజయవాడ పోలీసు కమిషనరేట్ లో అడ్మిన్ డీఎస్పీ సరిత కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
విజయవాడలోని మాచవరంలో ఉన్న సిద్ధార్ధ ఫార్మసీ కాలేజ్, నలందా స్కూల్ ప్రాంతాల్లో ఉన్న కిరాణా, పాన్ షాపుల్లో ఈగల్ టీమ్ ఈ తనిఖీలు చేసింది. ఇందులో భాగంగా ఆయా షాపుల్లో అమ్ముతున్న వస్తువుల్ని పరిశీలించారు. విద్యాసంస్ధల చుట్టూ 100 మీటర్ల దూరంలో ఉన్న అన్ని షాపుల్ని ర్యాండమ్ గా తనిఖీ చేసినట్లు ఈగల్ టీమ్ ఛీఫ్ తెలిపారు. ఇందులో పొగాకు, తంబాకు, సిగరెట్లు దొరికినట్లు వెల్లడించారు.

వారం రోజులుగా 6 వేల షాపుల్లో తనిఖీలు చేశామని, 7 లక్షల 50 వేలు జరిమానా కూడా విధించినట్లు ఈగల్ టీమ్ ఛీఫ్ తెలిపారు. అలాగే భవిష్యత్తులో ఈ ఉత్పత్తులు అమ్మకుండా హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఈ ఉద్యమంలో టీచర్లు కూడా భాగస్వాములు కావాలని కోరారు. విద్యాసంస్ధలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్, తంబాకు, పొగాకు, డ్రగ్స్, గంజాయి అమ్మకాలు జరిగితే 1972 నంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

ఇప్పటికే డ్రగ్స్ అక్రమ వినియోగం నిరోధానికి విద్యార్ధులకు 100 మీటర్ల పరిధిలో దుకాణాలపై నిఘా పెట్టామని, విద్యార్ధుల్లో అవగాహన కోసం డ్రగ్స్ వద్దు బ్రూ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తంబాకు, సిగరెట్ అమ్మకాలు, ఉత్పత్తులపై నిరంతర తనిఖీలు చేపడతామన్నారు. ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. తల్లితండ్రుల భాగస్వామ్యం కూడా ఇందులో పెంచుతామన్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications