ఎంసెట్ కౌన్సెలింగ్: ఏ ర్యాంకులవారు ఏ తేదీల్లో..

హైదరాబాద్: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఉమ్మడిగానే అడ్మిషన్ల జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్‌ అజయ్‌ జైన్‌ (ఎంసెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌ ), తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్‌ శైలజా రామయ్యర్‌ (ఎంసెట్‌ అడ్మిషన్ల కో కన్వీనర్‌) బుధవారం ఇక్కడి ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సమావేశమై ఏకాభిప్రాయంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఏ ర్యాంకుల వాళ్లకు ఏ రోజు వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవచ్చుననే విషయాన్ని వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

* 17-18 తేదీల్లో ఒకటో ర్యాంకు నుంచి 50 వేల ర్యాంకువరకు
* 20-21 తేదీల్లో 50,001 నుంచి లక్ష ర్యాంకు వరకు
* 22-23 తేదీల్లో1,00,001నుంచి 1,50,000 ర్యాంకు వరకు
* 24-25 తేదీల్లో 1,50,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు (2,03,000 ర్యాంకు) వరకు

EAMCET counselling begins

సమావేశం తర్వాత అజయ్‌జైన్‌ , శైలజా రామయ్యర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17 నుంచి 25 వరకు ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించిన వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. 26-27 తేదీలలో అభ్యర్థులు తమ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని తెలిపారు. 26న ఒకటో ర్యాంకు నుంచి లక్ష ర్యాంకు వరకు 27న 1,00,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులు అవసరమనుకుంటే తమ ఆప్షన్లలో మార్చుకోవచ్చని చెప్పారు. 30న సీట్ల కేటాయింపు జరుగుతుందని వారు తెలిపారు.

సీట్లు దక్కిన అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సెప్టెంబర్‌ ఒకటో తేదీన రిపోర్టు చేయాలని, అదే తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వారు వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 31లోగా అడ్మిషన్లు పూర్తిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు ఏయూ, ఎస్వీయూ పరిధిలో మొత్తం 24,901 మంది అభ్యర్థులు సర్టిపికెట్లను వెరిఫికేషన్‌ చేయించుకున్నారని ఎంసెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌ అజయ్‌జైన్‌ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌.డబ్ల్యు-1 కింద 330 ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. జేఎన్‌టీయూ, ఏయూ వైస్‌చాన్సెలర్లతో మాట్లాడి ఈ నెల 15లోగా అఫిలియేషన్లు, సంబంధిత ఉత్తర్వులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్‌డబ్ల్యు-2, 3 లకు సంబంధించి ఏఎఫ్‌ఆర్‌సీ నుంచి 15 కల్లా సమాచారం తెప్పించుకుని కళాశాలల జాబితాను విడుదల చేయిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలో 14 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరుగుతుందని ఎంసెట్‌ అడ్మిషన్ల కో కన్వీనర్‌ శైలజా రామయ్యర్‌ తెలిపారు.

తెలంగాణలో 23 హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. తెలంగాణలో ఎస్‌.డబ్ల్యు-1 కింద 315 ఇంజనీరింగ్‌ కళాశాలలున్నాయని చెప్పారు. జేఎన్‌టీయూ, ఓయూ వైస్‌చాన్సెలర్లతో మాట్లాడి ఈ నెల 15లోగా అఫిలియేషన్లు, సంబంధిత ఉత్తర్వులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ఎస్‌డబ్ల్యు-2, 3 లకు సంబంధించి ఏఎఫ్‌ఆర్‌ిసీ నుంచి 15 కల్లా సమాచారం తెప్పించుకుని కళాశాలల జాబితాను విడుదల చేయిస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+