ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన హెచ్ఈసి

మొదటి రోజు 1 నుంచి 5వేల ర్యాంకు లోపు వరకు ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌కు 2,15, 336 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
కాగా, ఉన్నత విద్యా మండలి విడుదల చేసే నోటిఫికేషన్‌తో తమకు సంబంధం లేదని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం 1956కు ముందు నుంచి తెలంగాణలో స్థిరపడినవారికే 'ఫాస్ట్' పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, ఈ పథకం విధి విధానాలు ఖరారు చేసేందుకు ఐదుగురు అధికారులతో కమిటీని నియమించింది. స్థానిక నిర్ధారించే ధృవపత్రాలను రెవెన్యూశాఖ జారీ చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఫీజు రీఎంబర్స్‌మెంట్ పేరు మార్చి 'ఫైనాన్పియల్ అసిస్టెంట్ ఫర్ స్టూడెంట్స్(ఫాస్ట్)' పేరుతో కొత్త స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిని విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications