YS Jagan-Navy Talks : జగన్ తో నేవీ అధికారుల భేటీ..విశాఖ తీరంలో సవాళ్లపై .. !
సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఏపీలో దాని భద్రత కోసం నేవీ పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా రాజధానిగా మారబోతున్న విశాఖ తీరంలో తూర్పునావికాదళం తీసుకుంటున్న చర్యల్ని అధికారులు ఇవాళ సీఎం జగన్ కు వివరించారు.
ఏపీలో తీర ప్రాంత భద్రత సవాలుగా మారుతోంది. ఇప్పటికే తీర ప్రాంతాల్లో కోస్ట్ గార్డ్ తో పాటు నౌకాదళం కూడా గస్తీ కాస్తున్నా ఎటు నుంచి ఏ ముప్పు పొంచి ఉంటుందో తెలియని పరిస్దితి. ఈ నేపథ్యంలో విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పునావికాదళం అనుక్షణం అప్రమత్తంగా ఉంటోంది. ఈ క్రమంలో నేవీ చేపడుతున్న చర్యలకు ఏపీ ప్రభుత్వం నుంచి కూడా సహకారం లభిస్తోంది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తూర్పు తీర రక్షక దళ కమాండర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ శివమణి పరమేష్ ఇవాళ కలిశారు. తూర్పు సముద్ర తీరంలో సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్ళను అధిగమించేందుకు తీర రక్షక దళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్‌కు ఏడీజీ శివమణి పరమేష్ వివరించారు. అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారాన్ని కూడా వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా సీఎంని కోస్ట్‌గార్డ్ ఉన్నతాధికారులు డీఐజీ యోగేంధర్ ఢాకా, కమాండెంట్ కే.మురళి, డిప్యూటీ కమాండెంట్ ఏబి.రామమ్ కూడా కలిశారు. తీర ప్రాంతంలో వారు చేపడుతున్న గస్తీ చర్యల్ని సీఎం జగన్ కు వివరించారు. విశాఖ రాజధానిగా మారబోతున్న క్రమంలో రాష్ట్రప్రభుత్వానికి కూడా ఇదో వ్యూహాత్మక ప్రాంతంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే నేవీ అధికారులు జగన్ ను కలిసి తాజా పరిస్ధితుల్ని ఎప్పటికప్పుడు వివరిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications