వాలంటీర్లపై ఈసీ నిర్ణయం: 66 లక్షల ఓటర్లు, వైసీపీ- టీడీపీ పై ఎఫెక్ట్..!?

ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ ఎన్నికల యుద్దం పతాక స్థాయికి చేరింది. ప్రచారం కొనసాగుతోంది. ఇదే సమయంలో వాలంటీర్ల పైన ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. పెన్షన్లను వాలంటీర్లు ప్రతీ నెలా నగదు రూపంలో అందిస్తున్నారు. ఇప్పుడు ఈసీ నిర్ణయంతో ప్రత్యామ్నాయం పై అన్వేషణ మొదలైంది. అయితే, 66 లక్షల మంది పెన్షనర్లు ఉండగా.. ఇప్పుడు పరిణామాలు రాజకీయంగా ఎవరి పైన ప్రభావం చూపిస్తాయనే చర్చ మొదలైంది.

ఈసీ తాజా ఆంక్షలతో
ఏపీలో కొంత కాలంగా వాలంటీర్ల వ్యవస్థ పైన రాజకీయంగా వివాదం కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ వాలంటీర్ల పైన చేసిన వ్యాఖ్యల పైన కేసు నమోదైంది. ఇదే సమయంలో చంద్రబాబు సైతం వాలంటీర్ల పైన తన అభిప్రాయం స్పష్టం చేసారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లను తప్పించారు. ఇప్పుడు తాజాగా మాజీ ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలోని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాలంటీర్ల పై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు వలంటీర్లను ఉపయోగించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్ధిదారులకు డబ్బు పంపిణీని చేయవద్దని స్పష్టం చేసింది.

EC issues order barring Andhra Pradesh government s ward village volunteers from duties

66 లక్షలకు పైగా పెన్షనర్లు
ప్రతీ నెలా 1వ తేదీనే ఉదయం వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి దాదాపు 66.4 లక్షల మందికి వృద్ధాప్య, సామాజిక, వికలాంగ, కిడ్నీ వ్యాధి గ్రస్తులకు పెన్షన్లు అందిస్తున్నారు. ఈ విధానం గురించి వైసీపీ నేతలు ప్రతీ సందర్భంలోనూ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘం తాజా ఆంక్షలతో వాలంటీర్లు ఎన్నికల కోడ్ ముగిసే వరకూ నేరుగా పెన్షనర్లకు నగదు పంపిణీ చేసే అవకాశం లేదు. వాలంటీర్ల స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో పెన్షన్లు అందించాలని సూచించింది. దీని పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే, వాలంటీర్లు ప్రతీ నెలా ఇంటికి వెళ్లి అందిస్తుండటంతో వారితో లబ్దిదారులు మమేకం అయ్యారు. ఇప్పుడు కొత్త విధానం ద్వారా అందించటం లబ్దిదారుల పైన ప్రభావం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.

EC issues order barring Andhra Pradesh government s ward village volunteers from duties

చంద్రబాబే కారణమా
చంద్రబాబు కుట్రలవల్ల ఇంటివద్దనే పెన్షన్ తీసుకునే అవకాశం వృద్ధులు కోల్పోయారని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు వైఖరి పేదలకు వ్యతిరేకం అని మరోమారు అర్థమైందని పెన్షనర్లు ఆవేదన చెందుతున్నారని చెబుతున్నారు. పేదలమీద గెలిచానని చంద్రబాబు అనుకుంటున్నారని వైసీపీ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబుకు ఎన్నికల్లో పెన్షనర్లు బుద్ది చెబుతారని వైసీపీ నేతలు టార్గెట్ చేసారు. ఇక, ఇప్పుడు పెన్షన్లు ఆలస్యం అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, ఇప్పుడు పెన్షనర్ల స్పందన ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.

అప్పుడే నిర్ణయం
జూన్ వరకు వాలంటీర్లు తిరిగి సేవల్లో కొనసాగే అవకాశం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాతనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక, ఇప్పటికే వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు కారణంగానే ఆయన మద్దతు దారులు వాలంటీర్లను ప్రజలకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ స్వాగతించింది. అయితే, సరిగ్గా ఎన్నికల ముందు దాదాపు 66 లక్షల మంది పైన ఈ నిర్ణయం ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో..రాజకీయంగా ఎవరి పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందనే చర్చ మొదలైంది. అయితే, ఇంత పెద్ద మొత్తంలో ఉన్న పెన్షనర్లకు పెన్షన్లు అందించేందుకు ఎలాంటి విధానం అమలు చేస్తారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+