ఈసీ హుకుం.. టీడీపీ, వైసీపీల పోస్టులతో పాటు ఆ పార్టీల పోస్టులను తొలగించిన ఎక్స్!!

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఈసీ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల పైన కూడా నజర్ పెట్టింది. ఈ క్రమంలోనే ఈసీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మరియు బీజేపీ రాజకీయ నాయకులు పెట్టిన నాలుగు పోస్టులను తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ కు హుకుం జారీ చేసింది.

ఈసీ ఆదేశాలతో ఆ పోస్టుల తొలగింపు
నోడల్ అధికారుల ఫిర్యాదుల మేరకు ఈసీ ఈ ఆదేశాలిచ్చింది. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎక్స్ నాలుగు పోస్టులను తొలగించింది. అయితే అవి భారత దేశంలో మాత్రమే తొలగించబడ్డాయని ఇతర దేశాలలో ఆ పోస్టులు కనిపిస్తాయని ఎక్స్ పేర్కొంది. ఏప్రిల్ 2023 నుండి ఎక్స్ భారతదేశం నుండి ఉపసంహరణ నోటీసును ప్రజలకు ముందస్తుగా బహిర్గతం చేయడం ఇదే మొదటిసారి.

EC orders X takes down four posts by leaders of BJP AAP YSR Congress TDP

వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చెయ్యటం నిషేధం
రాజకీయ ప్రచారకర్తలు తమ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ గా చేసుకుని రాజకీయాలు చేయడంపై ఎన్నికల సంఘం నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్స్ కు ఎన్నికల సంఘం హుకుం జారీ చేసింది. అయితే ఎన్నికల సంఘం జారీ చేసిన తొలగింపు ఆదేశాలను తామ ప్రభావిత వినియోగదారులకు తెలియజేశామని ఎన్నికల సంఘం జారీచేసిన ఆదేశాల పారదర్శకత కోసం తాము ఉత్తర్వులను ప్రచురిస్తున్నామని ఎక్స్ పేర్కొంది.

తన పోస్ట్ తొలగించిన వైసీపీ, టీడీపీ పోస్ట్ ఇలా
అయితే ఈసీ తొలగింపు ఉత్తర్వుల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్టును పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి తొలగించింది. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన పోస్టులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్ కనిపిస్తుంది.

వైజాగ్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పై చంద్రబాబు పోస్ట్ .. తొలగింపు
అందులో వైజాగ్ పోర్ట్ లో 25 వేల కిలోల డ్రగ్స్ సీబీఐ స్వాధీనం చేసుకుందని, ఏపీ పోలీసులు మరియు పోర్టు ఉద్యోగులు స్వాధీనం చేసుకోవడానికి సహకారం అందించలేదని పేర్కొంది. దీంతో ఏపీ ప్రభుత్వ ప్రమేయం ఇందులో ఉందని చంద్రబాబు పెట్టిన పోస్టును కూడా తొలగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఈ పోస్టులను తొలగించారు.

ఆప్ పోస్ట్ తొలగింత
ఇవి మాత్రమే కాక ఆమ్ ఆద్మీ పార్టీ ఈడీని, కేంద్రంలోని బిజెపిని టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్టులను ఎక్స్ తొలగించింది. మోదీ చిత్రాన్ని పెట్టి దానిపై బాండ్ చోర్ అంటూ క్యాప్షన్ తో పెట్టిన పోస్టును ఎక్స్ తొలగించింది. ఇక ఆ పోస్టులో ఈడి అరబిందో ఫార్మా డైరెక్టర్ ను అరెస్టు చేసిందని, తర్వాత ఆయన నుండే ఎలక్ట్రోరల్ బాండ్లను కొనుగోలు చేసిందని సంచలన ఆరోపణలు చేస్తూ పోస్ట్ పెట్టింది

బీజేపీ నేత పోస్ట్ తొలగింపు
ఇక బీహార్ ఉప ముఖ్యమంత్రి బిజెపి సభ్యుడు సామ్రాట్ చౌదరి ఖాతా నుండి కూడా ఎక్స్ మరొక ట్వీట్ ను తొలగించింది రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ ఎన్నికలలో పోటీ చేయడానికి టికెట్లు అమ్ముకోవడం సీజన్డ్ ప్లేయర్ అంటూ పేర్కొంది. అంతేకాదు తన కూతురిని కూడా వదలలేదని ఆమె నుంచి కిడ్నీ తీసుకుని టికెట్ ఇచ్చాడంటుూ సామ్రాట్ చౌదరి చేసిన ట్వీట్ ను కూడా ట్విట్టర్ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తొలగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+