AP Elections: జరుగు జగన్ సాంగ్ పై టీడీపీకి ఈసీ నోటీసులు-సీఐడీ చర్యలకు ఆదేశం..!
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ, ఎన్డీయే కూటమి పార్టీల మధ్య వ్యూహప్రతివ్యూహాలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాలు విమర్శలు, ప్రతివిమర్శలూ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ జరుగు జగన్ పేరుతో టీడీపీ రూపొందించిన వీడియో సాంగ్ ఇప్పడుు వైరల్ అవుతోంది. ప్రజా ప్రభుత్వం వస్తోంది జరుగు జగన్ అంటూ రూపొందించిన ఈ సాంగ్ ను నారా లోకేష్ యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. దీనిపై వైసీపీ ఫిర్యాదుతో ఈసీ నోటీసులు జారీ చేసింది.
సీఎం జగన్ ను కించపరిచేలా ఉన్న జరుగు జగన్ సాంగ్ ను నారా లోకేష్ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తోందంటూ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏపీ అదనపు సీఈవోకు నిన్న ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఏపీ అదనపు సీఈవో హరీంద్ర ప్రసాద్ స్పందించి టీడీపీకి నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు ఇది ఎందుకు రాదో చెప్పాలంటూ ఆదేశించారు.

అంతే కాదు ఈ వీడియో సాంగ్ ను యూట్యూబ్ నుంచి తొలగించాలని అదనపు సీఈవో ఆదేశాలు ఇచ్చారు. అలాగే దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఐడీ అదనపు డీజీకి కూడా ఆదేశాలు ఇచ్చారు. దీంతో సీఐడీ తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతోంది. ఎన్నికల వేళ సీఐడీ స్పందించి నారా లోకేష్, టీడీపీపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే దానిపైనా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications