Cash For Vote: ఏపీలో ఉద్యోగుల ఓటుకు నోటుపై ఈసీ ఆగ్రహం - తీవ్ర హెచ్చరిక.. !

ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో ఆరు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో హోం ఓటింగ్ పూర్తి కాగా.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగుల ఓటింగ్ కొనసాగుతోంది. అయితే ఇందులో ఉద్యోగులు చాలా చోట్ల ఓటుకు నోటు తీసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. దీనిపై రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఉద్యోగుల ఓటుకు నోటు వ్యవహారంపై ఈసీ ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీలో చాలా మంది ఉద్యోగులు ఓటుకు నోటు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఇవాళ తెలిపారు. ఇది చాలా దారుణం అన్నారు. పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేసేందుకు 3.2 లక్షల మంది ఉద్యోగులకు అనుమతి ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. హోం ఓటింగ్ కు 28 వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.
అత్యవసర సర్వీసులు కింద 31,000 మందికి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. పోలీసులు 40 వేలు కూడా కలుపుకుంటే 4.3 లక్షల మంది ఇలా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తున్నట్లు మీనా పేర్కొన్నారు.

ec serious on employees taking cash for vote warn to verify accounts call data

ఇందులో 3 లక్షల 3 వేల మంది ఇప్పటివరకూ ఓటు వేశారని ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. పలు కారణాల తో ఓటు వేయలేని వారి కోసం ఈ రోజు,రేపు మరో అవకాశం ఇచ్చామన్నారు. ఓటు వేయలేకపోయిన ఉద్యోగులు వారు సొంత నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ ఓటు వేయవచ్చన్నవారు. అయితే పోస్టల్ బ్యాలెట్ వేసే వారికి నగదు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. ఉద్యోగులు నగదు తీసుకోవడం చాలా దారుణమని ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరిలో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఒంగోలులో యూపీఐ ద్వారా కొంతమంది ఉద్యోగులకు నగదు పంపిణీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఈవో తెలిపారు.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపారు. నగదు తీసుకోవాలనుకునే ఉద్యోగులకు ఆయన తీవ్ర హెచ్చరికలు చేసారు. కాల్ డేటా రికార్డు,బ్యాంక్ అకౌంట్ ఆధారంగా ఆయా ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని సీఈవో హెచ్చరించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+