వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొంగ ఓట్లు వేస్తు మూడేళ్ల జైలు శిక్ష : తొలుత మాక్ పోలింగ్ : సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ కు స‌ర్వం సిద్ద‌మైంది. ఇప్ప‌టికే పోలింగ్ సిబ్బంది త‌మ సామాగ్రితో పోలింగ్ స్టేష‌న్ ల‌కు చేరుకున్నారు. ఇదే స‌మ‌యంలో పోలింగ్ స‌మ‌యంలో విస్తృత బందోబ‌స్తు ఏర్పాటు చేసారు. ఎవ‌రైనా దొంగ ఓట్లు లేదా బోగ‌స్ ఓట్లు వేస్తే మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది.

దొంగ ఓటు వేస్తే.. అంతే..

దొంగ ఓటు వేస్తే.. అంతే..

ఈ సారి ఎన్నిక‌ల సంఘం కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు అమ‌లు చేస్తోంది. పోలింగ్‌ సమయంలో ఎవ‌రైనా బోగస్‌ ఓట్ల.. దొంగ ఓట్లు.. రెండో ఓటు వేస్తే వారికి చట్ట ప్రకారం 3 ఏళ్ల జైలు శిక్ష ఖాయమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది హెచ్చరించారు. పోలింగ్ ఉద‌యం ఏడు గంట‌ల నుండి సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. దీని కోసం మొత్తం 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల తో పాటుగా 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4గంటల వరకు, సరిహద్దు ప్రాంతాల్లో 5గంటల వరకు కొన‌సాగుతోంది.
పోలింగ్ కు ముందు ఉద‌యం 5.30గంటల నుంచి మాక్‌ పోలింగ్ కొన‌సాగుతుంది. 50వరకూ ఓట్లు వేయించి, పోలింగ్‌ ప్రారంభానికి ముందే వాటన్నింటినీ డిలీట్‌ చేస్తారు. ఆ త‌రువాత రెగ్యుల‌ర్ పోలింగ్ కు అనుమ‌తిస్తారు.

ఓట‌ర్ల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు..

ఓట‌ర్ల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు..

ఓటు వేసేందుకు వ‌చ్చే దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్ప‌టికే గుర్తించిన 81వేల అంధులైన ఓటర్ల కోసం రెండు సెట్ల బ్రెయిలీ లిపి బ్యాలెట్‌ పత్రాలు సిద్ధంచేసిన‌ట్లు ఎన్నికల సంఘం స్ప‌ష్టం చేసింది. దివ్యాంగులు, వృద్ధులు, చంటిపిల్లలు కలిగిన మహిళలు నేరుగా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేసే విధంగా అవ‌కాశం క‌ల్పించ‌ను న్నారు. ఇక‌, పోలింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని అధికారులు ప్ర‌క‌టించారు. బూత్‌లోకి ఫోన్లు తీసుకు వచ్చినా.. సెల్ఫీలు తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఫోన్లను అనుమతించే సిబ్బందిపై కూడా చర్యలు ఉంటాయని ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది.

స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల పై దృష్టి..

స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల పై దృష్టి..

ఏపిలోని 13 జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసు ఉన్న‌తాధికారుల ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఏపి లోని 8,514 పోలింగ్‌ స్టేషన్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఎన్నిక‌ల విధుల్లో మొత్తం 85వేల మంది పోలీసులు, 197 కం పెనీల పారా మిలటరీ సిబ్బంది విధులు నిర్వ‌హిస్తున్నారు. ఎన్నికల రైడ్స్‌లో భాగంగా మొత్తంగా 28,049కేసులు నమో దు చేసిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. 1,99,525మందిని బైండోవర్ చేసారు.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసు ఉన్న‌తాధికారులు... ఎన్నికల విధులకు 2హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచారు. ఫ్యాక్షన్‌ ప్రాం తాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఏపి మొత్తంగా 10 వేల లైసెన్స్‌డ్‌ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Election Commission warned if any body try for bogus voting they will punish three years prison. EC says polling in AP start at 7am and continue up to evening 6 pm. no entry for mobile phones in polling booths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X