వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు చిక్కులే: మరిన్ని ఆస్తుల జప్తునకు ఈడి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మనీ లాండరింగ్ కేసుల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన అనుచరులకు చిక్కులు తప్పేట్లు లేవు. ఎన్డియెకు వెలుపల ఉన్న పార్టీల్లో తొలుత నరేంద్ర మోడీకి మద్దకు ప్రకటించిన పార్టీ వైయస్సార్ కాంగ్రెసే. అయితే, జగన్ నరేంద్ర మోడీని కలిసి మద్దతు ప్రకటించడంపై తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్ర వ్యాఖ్యలు వచ్చాయి.

మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) జగన్‌కు, ఆయన అనుచరలకు సంబంధించిన మరిన్ని ఆస్తుల జప్తునకు దిగవచ్చునని అంటున్నారు. మార్చి మొదటివారంలో ఈడి జగన్‌కు, ఆయన అనుచరులకు సంబంధించిన 863 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది.

ED prepares to attach more Jagan assets

సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా ఈడి జగన్‌పై, తదితరులపై 2012లో కేసులు నమోదు చేసింది. దర్యాప్తులో పలు ఆస్తులను ఈడి గుర్తించినట్లు సమాచారం. వాడరేవు, నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్‌కు సంబంధించిన ఆస్తులు ఈ జప్తులో ఉన్నాయి.

జగన్‌ను సిబిఐ 2013 మేలో అరెస్టు చేసింది. 2013 సెప్టెంబర్ వరకు ఆయన జైలులో ఉన్నారు. పది లక్షల లోపు ఉండే జగన్ ఆస్తి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వందల కోట్లకు చేరిందని సిబిఐ దర్యాప్తులో తేలింది.

English summary

 YSR Congress chief Jaganmohan Reddy was among the first non-NDA leaders to declare support to Narendra Modi. Ironically, in a likely first big anti-corruption initiative after Modi takes office, Enforcement Directorate could attach several more properties of Jagan and his associates, valued at hundreds of crores, in the money laundering cases filed against them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X