కల్తీ మద్యం కేసులో ట్విస్ట్: మల్లాది విష్ణు ఆస్తులు రూ.600 కోట్లు
విజయవాడ: విజయవాడ స్వర్ణ బార్ కల్తీ మద్యం కేసు కొత్త మలుపు తిరిగింది. కల్తీ మద్యం కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కాంగ్రెసు నాయకుడు మల్లాది విష్ణు దాదాపు రూ. 600 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్లు గుర్తించిందంటూ టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి.
మల్లాది విష్ణు కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడు. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. మల్లాది విష్ణు అక్రమాస్తుల కేసును సిట్ ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ (ఈడి)కి అప్పగించినట్లు సమాచారం.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మల్లాది విష్ణు భారీగా అస్తులు సమీకరించుకున్నట్లు తెలుస్తోంది. బినామీల పేర్ల మీద పెద్ద యెత్తున ఆస్తులను కూడబెట్టినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పరిసరాల్లో 28 వేల ఎకరాలను ఆయన సమీకరించుకున్నట్లు చెబుతున్నారు. వుడా చైర్మన్‌గా ఉన్నప్పుడు భారీగా ఆస్తులు సంపాదించినట్లు అనుమానిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పరిధిలో లేని ప్రాంతాల్లో మల్లాది విష్ణు భూములు సమీకరించకున్నట్లు చెబుతున్నారు.
ఇదిలావుంటే, ఆ వార్తలను మల్లాది విష్ణు ఖండిస్తున్నారు. తనకు అన్ని ఆస్తులు లేవని ఆయన అన్నారు. అటువంటివి ఏమీ లేవని ఆయన అన్నారు. తనపై అధికార తెలుగుదేశం పార్టీ కక్ష సాధిస్తోందని ఆయన అన్నారు.
-
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం!












Click it and Unblock the Notifications