రేపే అమరావతి శంకుస్థాపన: ముమ్మరంగా ఏర్పాట్లు, జ్యోతి వెలిగించిన బాబు(పిక్చర్స్)

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి విజయదశమి(అక్టోబర్ 22న) రోజున శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రముఖుల రాకకు మార్గాలను సుగమం చేశారు. ఇప్పటికే మూడు ప్రధాన వేదికల నిర్మాణం పూర్తయింది. రాజధాని రైతులు, ఆహ్వానితులు కూర్చునేందుకు కార్పెట్లతో గ్యాలరీని అందంగా అలంకరించారు.

మరో పక్క పార్కింగ్ ఏర్పాట్లు, హెలిప్యాడ్ల నిర్మాణం పూర్తయింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశ, విదేశీ ప్రముఖులు, రాయబారులు వస్తుండటంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన ఘట్టం హోమం. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించేందుకు ప్రధాన వేదిక పక్కనే రెల్లుగడ్డితో యాగశాలను నిర్మించారు. ప్రధాన వేదికకు ఇరువైపులా రెండు ఉప వేదికలు నిర్మించారు. వీటికి కొంచెం దూరంలో ప్రధానవేదికకు ఎదురుగా సాంస్కృతిక వేదిక సిద్ధం చేశారు.

ఇటు వేదికపై ఉన్న అతిథులకు, అభిముఖంగా ఉండే ఆహ్వానితులకు రెండు వైపులా కనిపించే విధంగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ప్రధాన వేదికల్లో ఒక దానిపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చుంటారు. మరో వేదికపై రాయబారులు, న్యాయమూర్తులు, పారిశ్రామిక ప్రముఖులు ఆశీనులవుతారు. వీరందరికీ ట్రిపుల్ ఇ పాస్‌లు కేటాయించారు.

అమరావతి ఏర్పాట్లు

అమరావతి ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి విజయదశమి(అక్టోబర్ 22న) రోజున శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

అమరావతి ఏర్పాట్లు

అమరావతి ఏర్పాట్లు

ప్రముఖుల రాకకు మార్గాలను సుగమం చేశారు. ఇప్పటికే మూడు ప్రధాన వేదికల నిర్మాణం పూర్తయింది. రాజధాని రైతులు, ఆహ్వానితులు కూర్చునేందుకు కార్పెట్లతో గ్యాలరీని అందంగా అలంకరించారు.

అమరావతి ఏర్పాట్లు

అమరావతి ఏర్పాట్లు

మరో పక్క పార్కింగ్ ఏర్పాట్లు, హెలిప్యాడ్ల నిర్మాణం పూర్తయింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశ, విదేశీ ప్రముఖులు, రాయబారులు వస్తుండటంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

అమరావతి ఏర్పాట్లు

అమరావతి ఏర్పాట్లు

శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన ఘట్టం హోమం. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించేందుకు ప్రధాన వేదిక పక్కనే రెల్లుగడ్డితో యాగశాలను నిర్మించారు.

అమరావతి ఏర్పాట్లు

అమరావతి ఏర్పాట్లు

ప్రధాన వేదికకు ఇరువైపులా రెండు ఉప వేదికలు నిర్మించారు. వీటికి కొంచెం దూరంలో ప్రధానవేదికకు ఎదురుగా సాంస్కృతిక వేదిక సిద్ధం చేశారు.

అమరావతి ఏర్పాట్లు

అమరావతి ఏర్పాట్లు

ఇటు వేదికపై ఉన్న అతిథులకు, అభిముఖంగా ఉండే ఆహ్వానితులకు రెండు వైపులా కనిపించే విధంగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ప్రధాన వేదికల్లో ఒక దానిపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చుంటారు.

అమరావతి ఏర్పాట్లు

అమరావతి ఏర్పాట్లు

మరో వేదికపై రాయబారులు, న్యాయమూర్తులు, పారిశ్రామిక ప్రముఖులు ఆశీనులవుతారు. వీరందరికీ ట్రిపుల్ ఇ పాస్‌లు కేటాయించారు.

అమరావతి ఏర్పాట్లు

అమరావతి ఏర్పాట్లు

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈ కార్యక్రమంలో పెద్దపీట వేస్తున్నారు. వారికి సభాస్థలిలో రెడ్‌కార్పెట్ పరచడంతో పాటు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేశారు.

అమరావతి ఏర్పాట్లు

అమరావతి ఏర్పాట్లు

అమరావతి సంకల్పయాత్ర పేరుతో రాష్ట్రం నలుమూలల నుంచి తీసుకువచ్చిన నీటిని, మట్టిని శంకుస్థాపన స్థలంలో నిక్షిప్తం చేసేందుకు వేదిక దగ్గర ప్రత్యేక కట్టడాన్ని సిద్ధం చేస్తున్నారు.

అమరావతి ఏర్పాట్లు

అమరావతి ఏర్పాట్లు

ప్రధాన వేదికకు 500 మీటర్లు దూరంలో పార్కింగ్ ఉంటుంది. ఉద్దండరాయునిపాలెం చేరుకునే అన్ని దారులను తీర్చిదిద్దుతున్నారు.

అమరావతి ఏర్పాట్లు

అమరావతి ఏర్పాట్లు

ముఖ్యంగా అమరావతి చరిత్ర, వర్తమానం, భవిష్యత్ నగర విశేషాలు ప్రధానికి వివరించేందుకు అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు వేదిక సమీపంలో ఇప్పటికే అణువణువూ పరిశీలించారు.

అమరావతి ఏర్పాట్లు

అమరావతి ఏర్పాట్లు

భారీ ఫ్లడ్‌లైట్లతో పాటు సభికులకు వక్తల ప్రసంగాలు వినిపించేలా మైకులు, సౌండ్‌బాక్స్‌లు ఏర్పాటు చేశారు. సభా స్థలిలో అన్ని చోట్ల సిసి కెమరాలు అమర్చారు. కాగా, ట్రిపుల్ ఎ పాస్‌లు ఉన్న వారిని కరకట్ట మీదుగా, డబుల్ ఎ పాస్‌లు ఉన్న వారిని కరకట్ట దిగువగా అనుమతిస్తారు.

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈ కార్యక్రమంలో పెద్దపీట వేస్తున్నారు. వారికి సభాస్థలిలో రెడ్‌కార్పెట్ పరచడంతో పాటు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. అమరావతి సంకల్పయాత్ర పేరుతో రాష్ట్రం నలుమూలల నుంచి తీసుకువచ్చిన నీటిని, మట్టిని శంకుస్థాపన స్థలంలో నిక్షిప్తం చేసేందుకు వేదిక దగ్గర ప్రత్యేక కట్టడాన్ని సిద్ధం చేస్తున్నారు.

ప్రధాన వేదికకు 500 మీటర్లు దూరంలో పార్కింగ్ ఉంటుంది. ఉద్దండరాయునిపాలెం చేరుకునే అన్ని దారులను తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా అమరావతి చరిత్ర, వర్తమానం, భవిష్యత్ నగర విశేషాలు ప్రధానికి వివరించేందుకు అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు వేదిక సమీపంలో ఇప్పటికే అణువణువూ పరిశీలించారు.

ప్రధాని దిగే హెలిప్యాడ్‌లు, ఆయన సేద తీరేందుకు ఏర్పాటు చేసిన విశ్రాంతి మందిరాన్ని చూసి భద్రతా సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో ప్రముఖులు వస్తుండటంతో నాలుగు జిల్లాల అధికారులు రాత్రింబవళ్లు ఏర్పాట్లులో తలమునకలైపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+